Asianet News TeluguAsianet News Telugu

'అగ్ని వీరుల దుస్థితి ఇది '.. రాహుల్ ట్వీట్ పై  ఘాటు విమర్శలు..

అగ్ని వీర్  త్యాగం పట్ల రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తూ భారత సైన్యంపై యువతను ఉసిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోందనీ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో  రాజకీయాలు చేస్తున్నారని బ్లూగ్రాఫ్ట్ సీఈవో అఖిలేష్ మిశ్రా మండిపడ్డారు.

Agniveer Akshay Laxman killed in Siachen, rahul comments KRJ
Author
First Published Oct 23, 2023, 12:27 AM IST

ఇండియన్ ఆర్మీ 'అగ్నీపథ్' పథకంతో ముందుకు వచ్చింది. దీని కింద 18 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత 4 సంవత్సరాల పాటు భారత సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించింది. ప్రతిఫలంగా వారికి జీతం, నైపుణ్యం కనబరిచిన 25% మందిని భారతీయ సైన్యంలో శాశ్వత నియామకం. లేదా  4 ఏండ్ల తర్వాత.. ఆ వ్యక్తికి రూ. 12 లక్షలు ఇస్తారు. వారికి భారత సైన్యం మెరుగైన శిక్షణ, పలు నైపుణ్యాలను నేర్పిస్తోంది. దీంతో వారికి ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. కానీ.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి పుకార్లను వ్యాప్తి చేయడంలో ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు.  

ఇప్పుడు తాజా విషయానికి వస్తే.. లడఖ్‌లోని ప్రపంచంలోని ఎత్తైన యుద్దభూమి అయిన సియాచిన్ వద్ద ఒక ఆపరేషన్ భాగంగా విధి నిర్వహణలో ఉన్న గవాతే అక్షయ్ లక్ష్మణ్ అనే అగ్నివీర్ ‌(Agniveer) మరణించాడు. లేహ్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఆదివారం ఈ విషయం తెలిపింది. మహారాష్ట్రకు చెందిన అగ్నివీర్ గవాతే అక్షయ్ లక్ష్మణ్ మరణం పట్ల ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇతర సైనికాధికారులు సంతాపం తెలిపారు. అయితే అగ్నివీర్‌ లక్ష్మణ్‌ ఎలా చనిపోయాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ అంశంపై విపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.  

అగ్నివీర్ గవాటే అక్షయ్ లక్ష్మణ్ మరణంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్ చేస్తూ.. “సియాచిన్‌లో ‘అగ్నివీర్’ పాట పాడుతూ అక్షయ్ లక్ష్మణ్ బలిదానం చేసిన వార్త చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఒక యువకుడు దేశం కోసం అమరవీరుడయ్యాడు - ఎటువంటి గ్రాట్యుటీ లేదు, అతని సేవలకు ఎలాంటి గుర్తింపు లేదు. అమరవీరుడు అయిన అతని కుటుంబానికి పెన్షన్ లేదు, అగ్నివీర్, భారత వీరులను అమమానించడమేనని విమర్శలు గుప్పించారు. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బ్లూగ్రాఫ్ట్ సీఈవో అఖిలేష్ మిశ్రా తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ చెప్పింది పూర్తిగా అబద్ధమని అన్నారు. రాహుల్‌గాంధీ పోస్ట్‌పై దుమ్మెత్తి పోస్తూ.. రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "భారతదేశం అంటే ఏమిటో అర్ధం కాని, భారతదేశాన్ని తన మాతృభూమిగా ఎప్పుడూ భావించని వ్యక్తి మాత్రమే, భారతదేశాన్ని దోచుకుని అనుభవించడానికి తన ఆస్తిగా భావిస్తాడు.", "భారతదేశంలోని అత్యంత కుటిల రాజకీయ నాయకులు కూడా ఆయుధాల గురించి మాట్లాడరు. శక్తులు, వారి మాటలకు హద్దు ఉంటుంది. కానీ రాహుల్‌గాంధీకి అది లేదు’’ అని వ్యంగ్యంగా అన్నారు. 

వాస్తవానికి .. వీరమరణం పొందిన సైనికుడి కుటుంబ సభ్యులకు నాన్ కాంట్రిబ్యూటరీ బీమా రూపంలో రూ.48 లక్షలు అందుతాయి. దీంతో పాటు రూ.44 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందజేయనున్నారు. ఇది కాకుండా, 'అగ్నివీర్' తన జీతంలో 30% 'సేవా నిధి'కి కూడా జమ చేస్తుంది, ప్రభుత్వం  అదే మొత్తాన్ని అతని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది .అతను వడ్డీతో పాటు దీన్ని పొందుతాడు. ఇది మాత్రమే కాదు, మరణించిన తేదీ నుండి వచ్చే 4 సంవత్సరాల వరకు మొత్తం జీతం కుటుంబానికి ఇవ్వబడుతుంది. ఈ విషాద ఘటన తర్వాత కుటుంబ సభ్యులకు ప్రతినెలా జీతంగా అందుతున్న మొత్తాన్ని కలిపితే వచ్చే 4 ఏళ్లలో రూ.13 లక్షలు అందుతాయి. బాధితురాలి కుటుంబానికి 'ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వార్ క్యాజువాలిటీ ఫండ్' నుంచి రూ.8 లక్షలు కూడా 
ఇవ్వనున్నారని వివరిస్తూ.. పోస్టు చేశారు.  

అదేవిధంగా పంజాబ్ 'అగ్నివీర్' అమృతపాల్ సింగ్ గురించి కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్ అసత్యాలు ప్రచారం చేశాయి. ఆ అగ్నివీర్ అంత్యక్రియలు కూడా సైనిక లాంఛనాలతో నిర్వహించలేదని ఆరోపించారు. అగ్నీపథ్ యోజన'కి ముందు, తరువాత నియమించబడిన సైనికుల మధ్య సౌకర్యాలు , ప్రోటోకాల్‌ల పరంగా ఎలాంటి వివక్ష లేదు. దశాబ్దాలుగా, ఆత్మహత్య లేదా స్వీయ గాయాలు కారణంగా మరణాలకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అమృతపాల్ సింగ్ సెంట్రీ డ్యూటీలో ఉండగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది అతని కుటుంబానికి , దేశ సైన్యానికి తీరని లోటు అని భారత సైన్యం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios