దారుణం.. భార్యను ముక్కలుగా నరికి.. గోనె సంచెలో వేసి నిర్మానుష్య ప్రదేశంలో విసిరేసిన భర్త.. ఎక్కడంటే ?

ఒడిశాలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఓ గోనె సంచెలో వేశాడు. వాటిని ఓ నిర్మానుశ్య ప్రదేశంలో పారేశాడు. 

Atrocious.. The husband cut his wife into pieces.. Put her in a sack and threw her in a deserted place..ISR

శ్రద్ధావాకర్ హత్య ను దేశం ఇంకా మరచిపోకముందే.. దేశంలోని పలు ప్రాంతాల్లో అలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ వంటి పలు చోట్ల ఇలాంటి ఘటనలు జగగ్గా.. తాజాగా ఒడిశాలోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో వేశాడు. అనంతరం వాటిని ఎవరూ లేని ప్రాంతంలో విసిరేశాడు.

విశ్వాసం చాటుకున్న శునకం..ఆత్మహత్యకు పాల్పడ్డ యజమానిని కాపాడేందుకు 4 గంటలు తీవ్రంగా ప్రయత్నించి.. చివరికి

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని పలాసియా గ్రామంలో సాధబ్‌ దాస్‌కు పదేళ్ల కిందట వివాహం అయ్యింది. అతడి భార్య పేరు మామాదాస్. అతడు తన భార్య, తల్లిదండ్రులు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఈ దంపతుల మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి. 

ఈ క్రమంలోనే గత ఆదివారం కూడా గొడవ జరిగింది. ఆగ్రహంతో అతడు తన భార్య హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ గోనె సంచిలో వేశాడు. ఆ భాగాలను గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుశ్య ప్రదేశంలో విసిరేశాడు. కానీ పలువురు అతడిని గమనించారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని గాలించారు. ఓ చోట గోనె సంచిలో అందులో మామాదాస్ డెడ్ బాడీ లభించింది. ఈ సమాచారం అందటంతో బస్తా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

దారుణం.. టిక్కెట్ డబ్బులు ఇవ్వలేదని కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో యువకుడి మృతి

ఇదే రాష్ట్రంలో అన్నం వండలేదని భార్యను ఓ భర్త కొట్టి చంపాడు. ఈ సంబల్ పూర్ జిల్లాలోని జమాన్కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాది గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడిని 40 ఏళ్ల సనాతన్ ధారువాగా, అతని భార్యను 35 ఏళ్ల పుష్ప ధారువాగా గుర్తించారు. సనాతన్, పుష్ప దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె కుచిందలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తుండగా, కుమారుడు ఆదివారం రాత్రి స్లీప్ ఓవర్ కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అయితే, సనాతన్ ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప కూర మాత్రమే వండిందనీ, అన్నం వండలేదని గుర్తించాడు. ఈ క్ర‌మంలోనే భార్య‌తో గొడ‌వ‌కు దిగాడు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, ఈ క్రమంలో భార్యపై దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

బెంగళూరు థియేటర్ లో ‘ది కేరళ స్టోరీ’ చూసిన నడ్డా.. విషపూరిత ఉగ్రవాదాన్నిసినిమా బహిర్గతం చేస్తుందంటూ కామెంట్స్

మృతురాలి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా తల్లి శవమై కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం శవపరీక్ష నిర్వహించి నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నట్లు జమాంకిరా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ జిత్ దాస్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌నీ, త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios