Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఐదేళ్ల బాలిక‌పై టీనేజ్ బాలుడి అత్యాచారం.. హ‌ర్యానాలో ఘ‌ట‌న‌

ఐదేళ్ల బాలికపై 15 బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పనికి వెళ్లి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్ కు తరలించారు. 

Atrocious.. Rape of a five-year-old girl by a teenage boy.. Incident in Haryana
Author
First Published Aug 25, 2022, 9:17 AM IST

మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లైంగిక నేరాల నియంత్రణ కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా వారిపై దాడులు అగ‌డం లేదు. ప్ర‌తీ రోజు ఎక్క‌డ ఒక చోట అత్యాచారాల నేరాలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా హ‌ర్యానాలో ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలిక‌పై ఓ టీనేజ్ బాలుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 

గురుగ్రామ్ సిటీలోని మురికివాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాధితురాలి త‌ల్లి దండ్రులు భ‌వ‌న నిర్మాణ కార్మికులుగా ప‌ని చేస్తుంటారు. ప్ర‌తీ రోజులాగే మంగ‌ళ‌వారం ఉద‌యం వారు ప‌నికి వెళ్లారు. ఇంట్లో ఐదేళ్ల కూతురు ఒంట‌రిగా ఉంది. దీంతో స‌మీపంలో ఉండే ఓ టీనేజ్ బాలుడు బాలిక ఇంట్లోకి ప్ర‌వేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. 

టిప్పు సుల్తాన్‌ను ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తాం.. బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ..

ప‌ని ముగించుకొని సాయంత్రం ఇంటికి వ‌చ్చిన త‌ల్లిదండ్రుల‌కు షాకింగ్ విష‌యం క‌నిపించింది. బాలిక ప్రైవేట్ పార్ట్ ల నుంచి తీవ్ర ర‌క్తస్రావం అవుతూ, గాయాలపాలై క‌నిపించింది. త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని బాలిక వారికి వివ‌రించింది. దీంతో తల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంత‌రం బాలిక బుధ‌వారం ఉద‌యం హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయ్యింది. 

మంగళవారం రాత్రి బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం నిందితుడైన బాలుడిని స్థానికులు గుర్తించారు. అనంత‌రం పోలీసులు 15 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి ఫరీదాబాద్ కరెక్షన్ హోంకు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ సందీప్ కుమార్ తెలిపారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9మంది మృతి..

ఇటీవ‌ల ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై ఆమె 13 ఏళ్ల బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. మే 12వ తేదీన చోటు జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని అరెస్టు చేసి ప్రయాగ్‌రాజ్‌లోని చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్‌కు పంపారు.

' ఏ దేవుడూ అగ్ర‌ కులానికి చెందినవారు కాదు’

బీహార్ లో మూడు రోజుల కిందట కూడా అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగ‌స్టు 16వ తేదీన బక్సర్ జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలోని తన ఇంటి నుంచి ప‌లు వ‌స్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన 13 ఏళ్ల బాలిక‌ను న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం ఆమెను పాట్నాకు తీసుకెళ్లారు. అక్క‌డ మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ఓ అద్దె ఇంట్లో మైన‌ర్ పై నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాలిక అనారోగ్యానికి గురి కావ‌డంతో ఆమెను తీసుకొచ్చి ఆగ‌స్టు 20వ తేదీన బక్సర్ జిల్లాలోని డుమ్రాన్ రైల్వే స్టేషన్‌లో దించారు. అనంత‌రం బాలిక ఇంటికి చేరుకొని త‌ల్లిదండ్రుల‌కు ఘ‌ట‌న‌ను వివ‌రించింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని నిందితుల‌ను అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios