Asianet News TeluguAsianet News Telugu

టిప్పు సుల్తాన్‌ను ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తాం.. బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ..

కర్ణాటకలోబీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్పకు నాలుక కోస్తాం అంటూ బెదిరింపు లేఖ వచ్చింది. అయితే తాను ఎప్పుడూ ముస్లింలందరినీ గుండాలని అనలేదని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఈశ్వరప్ప అన్నారు.

Karnataka Minister KS Eshwarappa Gets A Threat Letter over he calls Tipu Sultan Muslim Gunda
Author
First Published Aug 25, 2022, 8:53 AM IST

బెంగళూరు : కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్పకు బెదిరింపు లేఖ వచ్చింది. టిప్పు సుల్తాన్‌ను మరోసారి ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తానని ఆ లేఖలో బెదిరించారు. దీంతో ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లెటర్ ఆయన ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, హిందుత్వ ప్రతినిధిగా భావించే వీడీ సావర్కర్‌ల ఫొటోలు ఉండడం.. ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీశాయి.

దీనిమీద బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ముస్లింలందరినీ గుండాలు అని పిలవలేదని, అలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఈశ్వరప్ప అన్నారు. కర్నాటకలోని శివమొగ్గలో మైనారిటీలు మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తిస్తున్నారని బిజెపి సీనియర్ నాయకుడు కెఎస్ ఈశ్వరప్ప మంగళవారం ఆరోపించారు. "ముస్లిం పెద్దలకు నేను చెప్పేది ఇదే.. నేనెప్పుడూ ముస్లింలందరూ గుండాలు అని అనడం లేదు. ముస్లిం సమాజంలోని పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నాలు చేశారు, గుండాయిజంలో మునిగిపోతున్న యువతకు సలహా ఇవ్వాలని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

కృష్ణాష్టమి వేడుక‌ల్లో అప‌శృతి.. ఉట్టి కొడుతూ జారిపడ్డ యువకుడు.. చిక్సిత పొందుతూ మృతి..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమీర్ అహ్మద్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వీర్ సావర్కర్ పోస్టర్‌ను తొలగించేందుకు టిప్పు సుల్తాన్ అనుచరుల బృందం ప్రయత్నించడంతో శివమొగ్గ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఆగస్టు 16న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కెంపేగౌడ మెట్రో స్టేషన్‌లో వీడీ సావర్కర్ పెయింటింగ్‌ను ప్రదర్శించడం వివాదంలో భాగమైంది. స్టేషన్ పశ్చిమ ద్వారం మెట్ల పక్కన వేలాడదీసిన పెయింటింగ్, ముందుభాగంలో చంద్రశేఖర్ ఆజాద్, ఉధమ్ సింగ్, పైన ఎడమ వైపు సావర్కర్ లు ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios