Asianet News TeluguAsianet News Telugu

' ఏ దేవుడూ అగ్ర‌ కులానికి చెందినవారు కాదు’

దేవుడూ కూడా ఉన్నత వ‌ర్గానికి లేదా అగ్ర కులానికి చెందిన వాడు కాదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ)  వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంత్రొపాలజీ పరం..శివుడు  షెడ్యూల్డ్‌ కులానికి లేదా షెడ్యూల్డ్‌ తెగకు చెందిన వాడని ఆమె కొత్త  వివాదానికి తెరలేపారు.
 

JNU VC clarifies on caste of Gods remark
Author
Hyderabad, First Published Aug 25, 2022, 5:45 AM IST

ఏ హిందూ దేవుడూ ఉన్న‌త వ‌ర్గానికి లేదా అగ్ర కులానికి చెందిన వాడు కాద‌ని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ థాట్స్‌ ఆన్‌ జెండర్‌ జస్టిస్‌: డీకోడింగ్‌ ఆఫ్‌ యూనిఫాం సివిల్ కోడ్’ అనే అంశంపై  వీసీ శాంతిశ్రీ మాట్లాడుతూ..  'మానవశాస్త్రపరంగా.. దేవుళ్లు ఉన్నత కులానికి చెందిన వారు కాదని అన్నారు. శివుడుషెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందిన వ్యక్తి కావచ్చని చెబుతూ ఆమె కొత్త చర్చకు తెరలేపారు.

ఆమె త‌న ఉపన్యాసంలో..మనుస్మృతిలో మహిళలకు శూద్రుల హోదా ఇచ్చార‌నీ, అది స్త్రీల‌కు  తిరోగమనమని తెలిపారు. మనుస్మృతి ప్రకారం.. స్త్రీలందరూ శూద్రులని తెలిపారు. కాబట్టి ఏ స్త్రీ కూడా తాము బ్రాహ్మణులమని, మరో వర్గమని చెప్పుకోదు. వివాహం ద్వారానే.. మ‌హిళ త‌న‌ భర్త లేదా తండ్రి కులం వస్తుంది. ఇది స్త్రీకి అసాధారణ తిరోగమనమ‌ని పేర్కొన్నారు. ఇటీవల తొమ్మిదేళ్ల దళిత బాలుడిపై జరిగిన కుల హింస గురించి ఆమె ఇలా అన్నారు: "ఏ దేవుడూ ఉన్నత కులానికి చెందినవాడు కాదు".  మ‌న‌లో చాలా మందికి మన దేవతల మూలాలు మానవశాస్త్రపరంగా తెలియాలి. ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాదు , అత్యున్నతుడు క్షత్రియులు కాదని అన్నారు. 

 శివుడు షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ చెందిన వాడ‌నీ, ఎందుకంటే అతను పాముతో స్మశానవాటికలో కూర్చుని చాలా తక్కువ బట్టలు ధ‌రిస్తాడు. ఏ బ్రాహ్మణుడు స్మశానంలో  అలా ధైర్యంగా కూర్చోలేద‌నీ  ఆమె చెప్పింది.  అలాగే..  లక్ష్మి, శక్తి లేదా జగన్నాథంతో సహా "మానవశాస్త్రపరంగా" దేవుళ్ళు ఉన్నత కులానికి  చెందినవారు కాదని ఆమె పేర్కొన్నారు. హిందూ దేవుడైన జగన్నాథ స్వామిని తీసుకుంటే అతనొక గిరిజనుడనీ, కాబట్టి దేవుళ్లందరూ బ్రాహ్మణులనే వివక్షను కొనసాగించడం అర్థంలేనిదే అవుతుందని జేఎన్‌యూ వీసీ అన్నారు.

అయినా మనం చాలా అమానుషమైన  వివక్షను ఇంకా ఎందుకు గుర‌వ‌వుతున్నామ‌నీ, బాబాసాహెబ్ ఆలోచనలను పునరాలోచించడం, తిరిగి మార్చడం చాలా ముఖ్యమ‌ని అన్నారు. మనకు ఆధునిక నాయకుడు ఎవరూ లేరు. భారతదేశంలో అంబేడ్కర్‌ వంటి ఆలోచనాపరులు లేరు ‘అమానవీయమైన ఈ వివక్షను మనం ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నామ‌నేది మ‌నల్ని మ‌నం ప్ర‌శ్నించుకోవాల‌ని అన్నారు. హిందుత్వం అనేది ఒక మతం కాదనీ, అది ఒక జీవన విధానమ‌ని,  జీవన విధానం అయితే మనం విమర్శలకు ఎందుకు భయపడతామ‌ని ప్ర‌శ్నించారు.  యూనిఫాం సివిల్ కోడ్‌ను డీకోడింగ్ చేస్తున్నానని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios