Asianet News TeluguAsianet News Telugu

ఒడిశాలో అమానవీయం.. విక‌లాంగుడితో కాళ్లు నొక్కించుకొని, పాదాలు నాలుకతో నాకాలని బలవంతం.. వీడియో వైరల్

ఒడిశా లోని ఓ డీ-అడిక్షన్ సెంటర్ లో ఏడాది కిందట జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 

Atrocious in Odisha.. A person threatening a disabled person and forcefully pressed his feet.. Video viral
Author
Patna, First Published Aug 11, 2022, 11:40 AM IST

ఒడిశాలోని మయూర్‌భంజ్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆ వీడియోలో ఓ విక‌లాంగుడిని ఇద్దరు వ్యక్తులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఓ వ్య‌క్తి అత‌డిని క‌ర్ర‌తో బెదిరిస్తుండ‌గా.. మ‌రో వ్య‌క్తి అత‌డి పాదాల‌ను బ‌ల‌వంతంగా నొక్కాల‌ని బెదిరిస్తున్నాడు. అతడి పాదాలని నాలుకతో నాకాలని బలవంతం చేశారు. ఈ వీడియో ట్విట్టర్ వినియోగదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

వార్నీ... స్మార్ట్ ఫోన్ కనిపిస్తే కోతిపిల్లకూడా ఆగడం లేదు...

ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్ట‌ర్ లో యూజ‌ర్ లు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఈ ఘటన జరిగిందని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ప‌శువుల అక్ర‌మ ర‌వాణ కేసులో మ‌మ‌తా బెన‌ర్జీ సన్నిహిత నాయకుడి అరెస్టు

ఓ వికలాంగుడు నేల‌పై కూర్చొని ఉన్నాడు. రెడ్ క‌ల‌ర్ ష‌ర్ట్ ధ‌రించిన ఓ వ్య‌క్తి క‌ర్ర ప‌ట్టుకొని అటూ ఇటూ తిరుగుతుండ‌గా.. మ‌రో వ్య‌క్తి ఆ వికలాంగుడి ప‌క్క‌నే నిల‌బ‌డి కాళ్ల‌ను పైకి లేపాడు. దానిని నొక్కాల‌ని బ‌ల‌వంతం చేయ‌డంతో ఆ విక‌లాంగుడు ఏడ‌వ‌డం ఆ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. పాపం ఆ విక‌లాంగుడు త‌న‌ని విడిచిపెట్టాల‌ని ఆ వ్య‌క్తిని వేడుకుంటున్నాడు. కానీ అత‌డు తాను చెప్పిన‌ట్టు చేయ‌క‌పోతే భ‌యంక‌ర‌మైన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని బాధితుడిని బెదిరిస్తున్నాడు. నిస్సహాయ స్థితిలో ఆ బాధితుడు చివ‌రికి ప‌సుపు రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తి పాదాలను నొక్కాడు. మ‌ళ్లీ అత‌డి జుట్టు ప‌ట్టుకొని పాదాలను రెండుసార్లు నొక్కాల‌ని బ‌ల‌వంతం చేయ‌డం క‌నిపిస్తోంది. అలాగే పాదాలను నాలుకతో నాకాలాని బలవంతం చేశారు.

అవమానకరమైన చర్యకు పాల్పడిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఈ స‌మ‌యంలో అక్క‌డే డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉన్నవారు అడ్డు చెప్ప‌డానికి చాలా భ‌య‌ప‌డుతున్నారు. వీరంతా ఆ విక‌లాంగుడికి వెన‌క వ‌రుసలో క‌నిపిస్తున్నారు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో మయూర్‌భంజ్ పోలీసు సూపరింటెండెంట్ (SP) స్పందించారు. ఈ ఘ‌ట‌న గ‌తేడాది జ‌రిగింద‌ని ట్వీట్ చేశారు. అయినా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని ఎస్పీ కార్యాలయం వెల్ల‌డించింది.

గుర్గావ్ లో అమానుషం.. నైట్ క్ల‌బ్ బ‌య‌ట ఓ మ‌హిళ‌ను, ఆమె స్నేహితుల‌ను చిత‌క‌బాదిన బౌన్స‌ర్లు.. వీడియో వైర‌ల్

‘‘ ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేస్తాము. వారిద్ద‌రిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతాం. ఈ డీ-అడిక్షన్ సెంటర్లను మూసివేయడానికి సంబంధిత అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇది ఒక ఏడాది కింద‌ట జ‌రిగింది.’’ అని ఎస్పీ తెలిపారు. కాగా.. గత ఏడాది జూలైలో ఈ ఘటన జరిగిందని, వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం అరెస్టు చేశామని బరిపడ (మయూర్‌భంజ్) సబ్-డివిజనల్ పోలీసు అధికారి కెకె హరిప్రసాద్ తెలిపారు.  ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ లోని సెక్షన్‌లు 341 (ఒక వ్యక్తిని తప్పుగా నిరోధించడం), 323 (స్వచ్ఛందంగా గాయపర్చడం), 324 (ఆయుధం లేదా పదార్ధం ద్వారా స్వచ్ఛందంగా గాయపర్చడం), 307 (హత్యా ప్రయత్నం) కింద కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios