Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 13 ఏళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం.. 7గురు అరెస్టు..

13 ఏళ్ల బాలికపై పలువురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. బాలికను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

Atrocious.. A 13-year-old girl was gang-raped many times.. 7 people were arrested..
Author
First Published Jan 18, 2023, 9:04 AM IST

రాజస్థాన్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై పలువురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక జనవరి 4 నుంచి కనిపించకుండా పోయింది. నిందితులు తనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపింది. ఈ ఘటనలో 7 గురిని పోలీసులు అరెస్టు చేశారు.

బ్రేకప్ చెప్పిందని... ప్రేమించిన యువతిని కత్తితో పొడిచి చంపిన మాజీ ప్రేమికుడు..

ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రాంతం రాజ్‌సమంద్ ప్రాంతంలోని కెల్వారా పోలీస్ స్టేషన్‌లో పరిధిలో నివసించే 13 ఏళ్ల బాలిక జనవరి 4వ తేదీన కేల్వారా నుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్లే బస్సులో ఎక్కింది. ఆమెను కొందరు వ్యక్తులు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

కాగా.. కూతురు కనిపించకుండాపోయే సరికి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురును వెతికిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలోనే బాలిక ఉదయ్‌పూర్ బస్టాండ్‌లో కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వేగంగా స్పందించారు. ఉదయ్ పూర్ కు చేరుకొని బాలికను గుర్తించారు. తరువాత ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి అధికారులకు తనపై జరిగిన లైంగిక దాడిని వివరించింది. తాను కేల్వారా నుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్లే బస్సులో తాను ఎక్కానని, అక్కడ తనపై వివిధ ప్రాంతాల్లో పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక పేర్కొంది.

దారుణం.. టూవీలర్ తో 71యేళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు... ఏమైందంటే..

దీంతో పోలీసులు నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న 7గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది. 

రాజస్థాన్ లో లైంగిక వేధింపులు అధికంగా నమోదు అవుతున్నాయని వస్తున్న నివేదికలపై పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఉమేష్ మిశ్రా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచార కేసుల్లో 41 శాతం అబద్ధమని చెప్పారు. అత్యాచారాల కేసుల్లో రాజస్థాన్ దేశంలో మొదటి స్థానంలో లేదని న్నారు. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. 

చికెన్ కొనే విషయంలో గొడవ, రాళ్లదాడి.. గ్రామంలో కర్ఫ్యూ..!!

మధ్యప్రదేశ్‌లో అత్యాచారం కేసులు తక్కువగా నమోదవుతున్నాయని, చాలా కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని తెలిపారు. తమ రాష్ట్రంలో నమోదైన మొత్తం అత్యాచార కేసుల్లో 41 శాతం అబద్ధమని తేలితే, జాతీయ స్థాయిలో తప్పుడు కేసుల శాతం కేవలం 8 మాత్రమేనని రాజస్థాన్ డీజీపీ మిశ్రా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios