ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..?
పసుపును డైరెక్ట్ గా ముఖానికి రాయకూడదట. దాని వల్ల అందం సంగతి పక్కన పెడితే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.
పసుపు దాదాపు అందరు భారతీయుల ఇళ్లల్లో కచ్చితంగా ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా.. చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతి వంటలోనూ దీనిని ఉపయోగిస్తారు.
Turmeric Powder
అయితే.. కేవలం ఆహారంలో భాగంగా మాత్రమే కాకుండా.. సౌందర్య సాధణంగా కూడా పసుపును వాడతారు. ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల.. ఆ ముఖాన్ని వన్నె వచ్చి చేరుతుందని నమ్ముతారు. అయితే.. పసుపును డైరెక్ట్ గా ముఖానికి రాయకూడదట. దాని వల్ల అందం సంగతి పక్కన పెడితే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.
పసుపును డైరెక్ట్ గా ముఖానికి రాయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పొడి చర్మం వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు. ఏమౌతుంది లే అని డైరెక్ట్ పసుపు రాస్తే... చర్మం అలర్జీ, చికాకు, దురద, ఎర్రటి మొటిమలు వంటివి వస్తాయని చెబుతున్నారు.కాబట్టి ఇప్పుడు పసుపును నేరుగా ఉపయోగించకుండా ఎలా ఉపయోగించాలో చూద్దాం.
పసుపును నేరుగా ముఖానికి పట్టించకుండా పాలు లేదా పెరుగుతో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే కాకుండా గంధపు పొడిని పసుపులో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది. ఉట్టి పసుపు మాత్రం రాసుకోకూడదు.