కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత మృతి.. ఐదు నెలల్లో 8వ మరణం.. ఏడో పులి చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఘటన
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో విడుదల చేసిన చిరుతల్లో మరొకటి చనిపోయింది. గడిచిన ఐదు నెలల్లో మొత్తంగా 8 చిరుతలు మరణించాయి.
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో శుక్రవారం మరో చిరుత మృత్యువాత పడింది. దీంతో దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకొచ్చిన తరువాత ఇక్కడి పార్క్ లో చనిపోయిన పులుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఏడో చిరుత మరణించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం విషాదకరం.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి ఐదుగురు మృతి, నలుగురికి గాయాలు
చనిపోయిన చిరుత పేరు సూరజ్ అని అధికారులు తెలిపారు. అయితే అది ఎందుకు మరణించిందో ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఐదు నెలల్లో మరణించిన ఎనిమిదో చిరుత ఇది. సూరజ్ మరణానంతరం కునో నేషనల్ పార్క్ లో ఇంకా పది చిరుతలు మిగిలాయి. గత మంగళవారం తేజస్ అనే చిరుత తీవ్ర గాయాలతో చనిపోయిన సంగతి తెలిసిందే.
కాగా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో మొదటిది ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. సాషా అనే ఆడ చిరుత మూత్రపిండాల వ్యాధితో మరణించింది. ఏప్రిల్ లో దక్షిణాఫ్రికాకు చెందిన మగ చిరుతల్లో ఒకటైన ఉదయ్ గుండెపోటుతో మృతి చెందింది. మే నెలలో దక్ష అనే ఆడ చిరుత ఇద్దరు మగ చిరుతలతో జరిగిన ఘర్షణలో మరణించింది.
భవిష్యత్తులో చంద్రుడిపై నివసించవచ్చు - చంద్రయాన్ - 3 ప్రయోగం నేపథ్యంలో ప్రధాని మోడీ
మార్చిలో సియాయా (జ్వాలా)కు నాలుగు పిల్లలు పుట్టాయి. అయితే రెండు నెలల తర్వాత మే నెలలో అందులో ఓ చిరుత పిల్ల చనిపోయింది. బలహీనత కారణంగానే ఆ పిల్ల మృతి చెందినట్లు ప్రాథమికంగా తేలింది. మొదటి పిల్ల చనిపోయిన కొన్ని రోజుల మరో రెండు పిల్లలు కూడా మరణించాయి.
కాగా.. గత ఏడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్ కు తీసుకువచ్చి కునోలో విడిచిపెట్టారు. ఫిబ్రవరిలో మరో 12 చిరుతలను తీసుకురాగా, వాటిలో ఆరు అడవిలో, మిగిలినవి కునోలోని వివిధ ఎన్ క్లోజర్లలో ఉన్నాయి.