2025 నుంచి తయారయ్యే ప్రతీ ట్రక్కు క్యాబిన్ లోనూ ఏసీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల డ్రైవర్లకు సౌకర్యంగా ఉండటంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
డ్రైవర్లకు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి తయారయ్యే అన్ని ట్రక్ క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రక్ తయారీ ఇండస్ట్రీలతో ఏళ్ల తరబడి జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన.. లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ
ఈ తాజా నిర్ణయం వల్ల డ్రైవర్లకు ఉష్ణోగ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. గంటల తరబడి రహదారిపై గడిపే డ్రైవర్లకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వోల్వో, స్కానియా వంటి ప్రఖ్యాత ప్రపంచ తయారీ సంస్థలు ఇప్పటికే తమ హై-ఎండ్ ట్రక్కులలో ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లను అందిస్తున్నాయి. కానీ భారతీయ ట్రక్ తయారీదారులు ఇంకా ఈ ఫీచర్ ను స్వీకరించలేదు. అయితే ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదంతో.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకునేందుకు తయారీ సంస్థలకు 18 నెలల పరివర్తన వ్యవధి అందించనున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కాలువలో పడి 19 మందికి గాయాలు
ఈ విషయంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో కొంతమంది డ్రైవర్లు 12 లేదా 14 గంటలు వాహనం నడుపుతూనే ఉంటారు. అయితే ఇతర దేశాలలో బస్సు, ట్రక్ డ్రైవర్లకు గంటల సంఖ్యపై పరిమితులు ఉన్నాయి. మన డ్రైవర్లు 43 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వాహనాలు నడుపుతున్నారు. అలాంటప్పుడు డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలి. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లను ప్రవేశపెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు.
టిండర్ లో పరిచయమైన యూకే వ్యక్తితో యువతి ప్రేమ.. అతడిని నమ్మి 4.5 లక్షలు డిపాజిట్.. తరువాత ఏమైందంటే ?
కాగా.. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మొదట 2016 లో ఈ అవసరాన్ని ప్రతిపాదించింది. దీనిపై తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధనను ఆప్షన్ గా ఉంచాలని అభ్యర్థించాయి. క్యాబిన్లలో ఏసీ ఉండటం వల్ల డ్రైవర్లకు మగతగా అనిపించవచ్చని కొందరు వాదించారు. కానీ వారి వాదనలను రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు తోసిపుచ్చారు. లగ్జరీ బస్సులలో బస్సు డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు ఉంటున్నాయని నొక్కి చెప్పారు.
ఇప్పటికే ఐదుగురు భార్యలు.. మరో యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి పెళ్లి.. హిందూ సంస్థల ఆందోళన
అయితే క్యాబిన్లలో ఏసీ ఉండటం వల్ల డ్రైవర్లు అలసిపోకుండా ఉంటారు. దీంతో పాటు వారికి సౌకర్యంగా ఉంటుంది. ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాగా.. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ట్రక్ తయారీ కంపెనీలకు ఓ ట్రక్కుకు రూ.10,000 నుంచి రూ.20,000 అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.
