బెంగుళూరుకు చెందిన ఓ యువతి టిండర్ యాప్ ద్వారా రూ. 4.5 లక్షలు మోసపోయింది. ఆ ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి ఓ యువతితో తాను యూకే వాసినని చెప్పాడు. అతడిని నమ్మి ఆ యువతి రూ.4.5 లక్షలు డిపాజిట్ చేసింది. కానీ తరువాత అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. 

బెంగుళూరుకు చెందిన ఓ మహిళకు టిండర్ లో వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను యూకేకు చెందిన వ్యక్తినని అతడు ఆమెను నమ్మించాడు. కొంత కాలం తరువాత తాను ఇండియాకు రావాలని అనుకుంటున్నానని, డబ్బులు పంపించాలని అతడు కోరడంతో ఆమె పంపించాడు. అయితే అప్పటి నుంచి అటు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించింది.

ఇప్పటికే ఐదుగురు భార్యలు.. మరో యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి పెళ్లి.. హిందూ సంస్థల ఆందోళన

వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న 37 ఏళ్ల మహిళ ‘టిండర్’ అనే ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో మ్యాచ్ లు పరిశీలించింది. అయితే ఆమెకు యూనైటెడ్ కింగ్ డమ్ లో పని చేస్తున్న ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో వారి మధ్య సన్నిహితం పెరిగి ప్రేమకు దారి తీసింది. ఇలా వీరి మధ్య కొంత కాలం ఆన్ లైన్ యాప్ ద్వారా చాటింగ్ కొనసాగింది. 

తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

అయితే కొన్ని రోజలు తరువాత ఆ యువతిని చూసేందుకు తాను ఇండియా వస్తానని అతడు తెలిపాడు. కానీ తన వద్ద ఇండియాకు వచ్చేందుకు డబ్బులు లేవని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె 4.5 లక్షలను డిపాజిట్ చేసింది. డబ్బులు పంపించిన నాటి నుంచి అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.