ఇప్పటికే ఐదుగురు భార్యలు ఉన్న ఓ వ్యక్తి మరో యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను ఇస్లాం మతంలోకి మార్చి, ఆ మతాచారం ప్రకారం వివాహం చేసుకున్నాడు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అతడికి ఇప్పటికే ఐదుగురు భార్యలు ఉన్నారు. అయినా కూడా ఓ 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఇస్లాం మతంలోకి మార్చాడు. తరువాత ఇస్లామిక్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మితవాద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని షామ్లీ జిల్లాకు చెందిన రషీద్ కు ఇప్పటికే ఐదుగురు భార్యలు ఉన్నారు. అయితే ఇటీవల ఆయన ఓ 19 ఏళ్ల యువతిని అపహరించాడు. అనంతరం ఆమెను ఇస్లాం మతంలోకి మార్చాడు. ఇస్లామిక్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు చాప్రౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రషీద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పాటలు నేర్చుకునేందుకు చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తే.. ఐదేళ్లుగా యువతిపై అత్యాచారం..
అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ కార్యకర్తలతో సహా స్థానిక హిందూ సంస్థల కార్యకర్తలు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగారు. పోలీసుల ఫిర్యాదు విషయం తెలుసుకున్న నిందితుడు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొందరగా తొలగించకపోతే మరో కుమార్తెను కూడా తీసుకెళ్తానని బెదిరించాడు. అయితే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిఘటించినా ఆ మహిళ ఇప్పటికీ నిందితుడి వెంటే ఉంది.
దారుణం.. రోడ్డుపై నిలబడిన స్కూటీని ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి.. (వీడియో)
కాగా.. ఆ యువతిని ఈ నెల 22వ తేదీలోగా తన కుటుంబ సభ్యులకు అప్పగించాలని, లేనిపక్షంలో గ్రామంలో ఆందోళన చేపడతామని హిందూ సంస్థ సభ్యులు హెచ్చరించారు. నిందితుడు రషీద్ కు ఇప్పటికే ఐదుగురు భార్యలు ఉన్నారని, వారిలో నలుగురు హిందువులు ఉన్నారని ఆరోపించారు. మతమార్పిడి కోసం రషీద్ ఉద్దేశపూర్వకంగా హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. తరువాత వారి ద్వారా మరి కొందరిని టార్గెట్ చేస్తారని తెలిపారు.
