జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి సమోత్ర చన్నీ ప్రాంతంలో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మందికి గాయాలు అయ్యాయి. 

జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబా జిల్లాలో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో మహిళలు, చిన్నారులు సహా సుమారు పంతొమ్మిది మందికి గాయాలయ్యాయి. సమోత్ర చన్నీ ప్రాంతంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

టిండర్ లో పరిచయమైన యూకే వ్యక్తితో యువతి ప్రేమ.. అతడిని నమ్మి 4.5 లక్షలు డిపాజిట్.. తరువాత ఏమైందంటే ?

ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే స్థానికులు, పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వీరంతా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను ఘగ్వాల్ ట్రామా సెంటర్ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. కాగా.. గాయపడిన వారిలో కూలీలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. కార్మికులంతా ఇటుక బట్టీలో పని చేసేందుకు కశ్మీర్ వైపు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు.

Scroll to load tweet…

గత నెల చివరిలో కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇలాగే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 30వ తేదీన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇప్పటికే ఐదుగురు భార్యలు.. మరో యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి పెళ్లి.. హిందూ సంస్థల ఆందోళన

ఝజ్జర్ కోట్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు అమృత్ సర్ నుంచి కత్రాకు పర్యాటకులతో వెళ్లోంది. ఈ ఘటనపై జమ్మూ డీసీ స్పందించారు. పలువురు ప్రయాణికులతో అమృత్ సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిందని, దీంతో పది మంది చనిపోయారని చెప్పారు. గాయాలపాలైన వారిని హాస్పిటల్ కు తరలించామని తెలిపారు.

పాటలు నేర్చుకునేందుకు చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తే.. ఐదేళ్లుగా యువతిపై అత్యాచారం..

కాగా.. గతవారం దక్షిణ కశ్మీర్ లోని బర్సూ అవంతిపొరా వద్ద శ్రీనగర్ -జమ్మూ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన పర్యాటకులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాకు చెందినవారు.