ఢిల్లీలో నేరాలు పెరుగుతున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అర్థవంతమైన చర్చ కోసం తన మంత్రివర్గంతో సమావేశం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం లేఖ రాశారు.

దేశ రాజధానిలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తో ఢిల్లీ క్యాబినెట్ సమావేశం కావాలని ప్రతిపాదించారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆయన సోమవారం లేఖ రాశారు.

టిండర్ లో పరిచయమైన యూకే వ్యక్తితో యువతి ప్రేమ.. అతడిని నమ్మి 4.5 లక్షలు డిపాజిట్.. తరువాత ఏమైందంటే ?

గత 24 గంటల్లో ఢిల్లీలో జరిగిన నాలుగు హత్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఇలాంటి తీవ్రమైన నేరాలు ఢిల్లీని కుదిపేశాయి కాబట్టి వారి జీవితాల భద్రత గురించి నివాసితులలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి తక్షణ ప్రభావవంతమైన చర్యలను ప్రారంభించాలి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో గత 24 గంటల్లో నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ’’ అని లేఖ రాశారు.

ఇప్పటికే ఐదుగురు భార్యలు.. మరో యువతిని కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి పెళ్లి.. హిందూ సంస్థల ఆందోళన

ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని పెంచాలని, ఈ విషయంపై ఢిల్లీ వాసులతో తక్షణం సంప్రదింపులు జరపాలని కేజ్రీవాల్ సూచించారు. ఈ ముఖ్యమైన అంశంపై అర్థవంతమైన చర్చ కోసం తమ మంత్రివర్గ సహచరులతో సమావేశం ఏర్పాటు చేయాలని తాను ప్రతిపాదిస్తున్నానని, ఢిల్లీలో చట్టబద్ధ పాలనను నిర్ధారించడానికి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం పేర్కొన్నారు.

తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

అధికారిక నేర గణాంకాలను ప్రస్తావిస్తూ.. మహిళలపై నేరాల నివారణ చర్యలు తీసుకోవడంలో హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), లెఫ్టినెంట్ గవర్నర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఢిల్లీ వాసుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యతను అప్పగించినా.. వారు విధి నిర్వహణలో పదేపదే విఫలమవుతున్నారని భావించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఢిల్లీ పోలీసు సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు, ఆస్తుల భద్రత కోసం పెద్ద సంఖ్యలో ప్రైవేట్ గార్డులను నియమించుకుంటున్నారని సీఎం కేజ్రీవాల్ అన్నారు.