కర్ణాటకకు చెందిన ఓ వృద్ధురాలు ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. రైలు చెట్టును ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాక్ పక్క నుంచి ఎర్రటి గుడ్డ తీసుకొని పరిగెత్తింది. చివరికి రైలును ఆపింది. ఆమెను రైల్వే శాఖ సన్మానించింది. 

70 ఏళ్ల వృద్ధురాలు ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ట్రాక్ పై చెట్టు పడి ఉండటాన్ని గమనించిన ఆమె రైలును ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఎర్రటి గుడ్డను ఊపుకుంటూ రైలు వైపు పరిగెత్తింది. గుండెకు ఆపరేషన్ జరిగిందన్న సంగతి పక్కన పెట్టి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించింది. చివరికి రైలు ఆగింది. ఆమె సాహసాన్ని గుర్తించిన అధికారులు ఘనంగా సన్మానించారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

చోరీ చేసి డబ్బు ఎత్తుకెళ్లారు.. తెల్లారి మళ్లీ అక్కడే వదిలివెళ్లారు.. ఛత్తీస్‌గఢ్‌ లో విచిత్ర ఘటన

వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని మందారా ప్రాంతంలో 70 ఏళ్ల వృద్ధురాలు చంద్రావతి నివసిస్తోంది. కొంత కాలం కిందట ఆమె గుండె శస్త్రచికిత్స చేయించుకుంది. మార్చి 21వ తేదీన మధ్యాహ్నం భోజనం తరువాత ఆమె నిద్రపోవడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ సమయంలో ఒక్క సారిగా ఏదో పర్వతం కూలిపోయినట్టుగా శబ్దం వినిపించింది. దీంతో ఏం జరిగిందో చూద్దామని బయటకు వచ్చింది. తనకు ఇంటికి సమీపంలో, పడిల్, జోకటే మధ్య పచ్చనాడి సమీపంలోని మందారాలో ఉన్న రైల్వే ట్రాక్ పై పడిల్, జోకటే మధ్య పచ్చనాడి సమీపంలో) ఓ పెద్ద చెట్టు కూలిపోయిందని గమనించింది.

ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. నిందితుడైన బాలుడు అరెస్టు..

దీని వల్ల రైలుకు ప్రమాదమని చంద్రావతికి అర్థమైంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2.10 గంటలు అవుతోంది. ఆ సమయంలో మంగళూరు నుంచి ముంబైకి మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరుతుందని ఆమెకు తెలుసు. ఎందుకంటే ముంబైలోని తన బంధువులు తరచూ ఆ రైలులోనే ప్రయాణిస్తుంటారు. ఈ విషయాన్ని బయటకు వెళ్లి రైల్వే అధికారులకు సమాచారం అందించాలంటే ఎక్కువగా సమయం లేదని ఆమె గ్రహించింది. 

ప్రశాంత్ కిశోర్ మొదటి విజయం.. బీహార్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో జన్ సూరజ్ అభియాన్ మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపు..

దీంతో ఇక ఆమె మిగితా విషయాలు ఏవీ ఆలోచించలేదు. వెంటనే ఇంటికి పరిగెత్తి, తన మనవడి ఎర్రటి గుడ్డను తీసుకొని తిరిగి ట్రాక్ వైపు వచ్చి, ట్రాక్ పక్క నుంచి రైలుకు ఎదురుగా పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె చేతిలో ఉన్న ఎర్రటి గుడ్డను గ్రహించిన లోకో పైలెట్ రైలును ఆపేశాడు. ఆ చెట్టు పడి ఉన్న ప్రాంతానికి సురక్షితమైన ప్రాంతంలో రైలు ఆగింది. దీంతో ఆ వృద్ధురాలు ఊపిరి పీల్చుకుంది.

కొంచెం సమయం తరువాత లోకో పైలట్, ప్రయాణికులు రైలు దిగి చంద్రావతికి కృతజ్ఞతలు తెలిపారు. చెట్టును భాగాలుగా నరికి ట్రాక్ పై నుంచి తొలగించారు. తరువాత అక్కడి నుంచి రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు తన ప్రయాణం ప్రారంభించింది. చెట్టు కూలిన సమయంలో తన కుమారుడు పనికి, మనవడు కళాశాలకు వెళ్లడంతో తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చంద్రావతి తెలిపారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. 

గౌతమ్ అదానీకి శరద్ పవార్ మద్దతు.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ టార్గెటెడ్ గా ఉందంటూ వ్యాఖ్యలు..

పెను ప్రమాదాన్ని నివారించిన చంద్రావతిని రైల్వేశాఖ గత బుధవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తన ఇంట్లో జరిగిన ఓ విషాదాన్ని ఆమె అందరికీ వివరించారు. ఈ రైల్వే ట్రాక్ వల్ల తమ ఇంటికి రోడ్డు సౌకర్యం లేదని, దీంతో తన భర్త వాహనాన్ని ట్రాక్ అవతల ఉన్న ఇళ్లలో పార్క్ చేసి తమ ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాడని తెలిపారు. ఇలా వస్తున్న సమయంలో ఒక రోజు ట్రాక్ పై జారిపడ్డారని, కొన్ని గంటల్లోనే ఆయన మరణించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.