గౌతమ్ ఆదానీ గ్రూప్స్ పై వెలువడిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ టార్గెటెడ్ గా కనిపిస్తోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేసిన ఆందోళనను కూడా ఆయన తప్పుబట్టారు. గౌతమ్ అదానీకి మద్దతుగా నిలిచారు. 

అదానీ-హిండెన్ బర్గ్ వివాదంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మద్దతుగా నిలిచారు. ఈ అంశంపై పవార్ అభిప్రాయాలు ప్రతిపక్షాల వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. హిండెన్ బర్గ్ నివేదికపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీ, అదానీలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ అనేక అంశాల్లో ప్రతిపక్షాల వైపు ఉండే శరద్ పవార్. ఈ విషయంలో మాత్రం వారికి విరుద్ధంగా ఉండటం గమనార్హం. 

అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోకపోతే శూర్పణఖలా కనిపిస్తారు - బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు

తాజాగా ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్సీపీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. అదానీ-హిండెన్ బర్గ్ వివాదం అంశానికి అనవసర ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గతంలో కూడా అనేక మంది అదానీపై ఇలాంటి ప్రకటనలు చేశారని, కొన్ని రోజుల పాటు పార్లమెంటులో గందరగోళం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఈసారి ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ‘‘అదానీ గ్రూప్స్ వచ్చిన రిపోర్ట్ లో ఏయే అంశాలను ఉంచారు. వాటిని చెప్పిందెవరు ? ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన వారి గురించి మేమెప్పుడూ వినలేదు. వారి నేపథ్యం ఏమిటి ?’’ అని శరద్ పవార్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా శరద్ పవర్ ఇతర ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. ఈ అంశంపై చెలరేగిన రచ్చను తప్పుబట్టారు. ‘‘ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం కలిగించే సమస్యలను లేవనెత్తితే దాని మూల్యం దేశ ఆర్థిక వ్యవస్థ భరిస్తుంది.. మేము ఈ విషయాలను విస్మరించలేము. ఇది లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది’’ అని అన్నారు. 

వార్నీ.. మద్యం మత్తులో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు..తర్వాత ఏమైందంటే ?

"దేశంలోని ఒక పారిశ్రామిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు, అది కనిపిస్తుంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి" అని పవార్ జోడించారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని కాంగ్రెస్ డిమాండ్ చేయడం గురించి అడిగినప్పుడు, ఎన్‌సిపి అధ్యక్షుడు తన మహారాష్ట్ర మిత్రపక్షానికి భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అన్నారు. ఈ అంశంపై జేపీసీ కాకుండా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణకు పవార్ ప్రాధాన్యం ఇచ్చారు. “ఎవరూ ప్రభావితం చేయలేని సుప్రీంకోర్టు వారు విచారణ జరిపితే, అప్పుడు నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సుప్రీం కోర్టు విచారణ ప్రకటించిన తర్వాత, జెపిసి యొక్క ప్రాముఖ్యత లేదు. విచారణ చేయండి.. అవసరం లేదు’’ అని పవార్ పేర్కొన్నారు.

‘దేశంలోని ఒక పారిశ్రామిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణ జరపాలి’’ అని శరద్ పవార్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని డిమాండ్ చేయడంపై ప్రశ్నించగా.. ఆయన భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై జేపీసీ కంటే సుప్రీంకోర్టు నియమించిన కమిటీతో విచారణ జరిపించాలని పవార్ సూచించారు. ‘‘ఎవరూ ప్రభావితం చేయలేని సుప్రీంకోర్టు విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు విచారణ ప్రకటించిన తర్వాత జేపీసీ విచారణ అవసరం లేదు. ’’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.

మెట్రోలోనే రెచ్చిపోయిన జంట.. హగ్ చేసుకొని, ముద్దులు పెట్టుకుంటూ లోకాన్ని మర్చిపోయిన ప్రేమికులు.. వీడియో వైరల్

ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ప్రచురించిన ఒక నివేదికలో అదానీ గ్రూప్ తన షేరు ధరలను పెంచడానికి అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. కాగా.. ఈ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి.