చోరీకి గురైన నగదు తిరిగి మన చేతికి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటే తప్ప ఆ డబ్బులు మన చేతికి రావు. అయితే ఛత్తీస్‌గఢ్ ఇలా చోరీకి గురైన నగదు పోలీసుల ప్రమేయం లేకుండా బాధితులకు దక్కాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కొన్ని కథలు వినడానికి భలేగా, వింతగా ఉంటాయి. మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అవి విన్న తరువాత.. ఇలా కూడా చేస్తారా ? అని మనం నోరెళ్లబెడతాం. అలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో దొంగల ముఠా చొరబడి నగదును ఎత్తుకెళ్లింది. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ డబ్బునంతా అక్కడే వదిలేసి వెళ్లింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.
ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. నిందితుడైన బాలుడు అరెస్టు..
వివరాలు ఇలా ఉన్నాయి. బిలాస్ పూర్ జిల్లాలోని బిల్హా ప్రాంతానికి చెందిన శోభారామ్ కోషాలే తన భూమిలో కొంత భాగాన్ని రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి అమ్మాడు. మార్చి 27న ల్యాండ్ రిజిస్ర్టేషన్ జరిగింది. ఈ సమయంలో భూమి కొనుగోలు చేసిన వ్యక్తి కొషాలేకు కొంత మొత్తాన్ని చెక్కు రూపంలో, మరికొంత మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించారు. దీంతో కోషాలే తనకు వచ్చిన 95 వేల నగదును ఇంటి బేస్ మెంట్ లో భద్రపరిచాడు.
అయితే మరుసటి రోజు డబ్బు మొత్తం మాయమైంది. ఎవరో నగదును దొంగతనం చేశారని ఆయన గ్రహించాడు. దీంతో బాధితుడు వెంటనే ఏప్రిల్ 1వ తేదీన బిల్హా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. ఈ దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గౌతమ్ అదానీకి శరద్ పవార్ మద్దతు.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ టార్గెటెడ్ గా ఉందంటూ వ్యాఖ్యలు..
కాగా.. పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఆశ్చర్యకరంగా కోషాలే ఇంటి ఆవరణలోనే ఆ డబ్బు లభించింది. దీంతో పోలీసులు, కోషాలే విస్తుపోయారు. దొంగలు కావాలనే డబ్బును తిరిగి ఇంట్లో వదిలేసి వెళ్లారని వారంతా భావిస్తున్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తరువాత చోటు చేసుకునే పర్యవసానాలకు భయపడి ఉండి దొంగలు ఇలా చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు.
అయితే పోలీసులు మాత్రం నిందితులను పట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, దొంగలను వెంటనే పట్టుకుంటామని వారు చెబుతున్నారు. కాగా.. వాస్తవానికి ఆ దొంగలు ఇంట్లో తిరిగి డబ్బులు ఎందుకు వదిలేసి పారిపోయారనే విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. పోలీసులు వారిని పట్టుకొని, వారి నుంచి దీనికి కారణం తెలుసుకుంటే తప్ప అసలు విషయం ఏంటో తెలియదు.
