ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానంటూ ఓ బాలుడు మీడియా ప్రతినిధికి మెయిల్ పంపించాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. బాలుడి వయస్సు 16 సంవత్సరాలు కాగా.. తాజాగా 11వ తరగతి పూర్తి చేశాడు. 

ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరింపు సందేశాలు పంపినందుకు లక్నోకు చెందిన ఓ బాలుడిని నోయిడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. బీహార్ కు చెందిన ఆ బాలుడిని ఉదయం సమయంలో లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో అరెస్టు చేసి నోయిడాకు తీసుకువచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) రజనీష్ వర్మ తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

ప్రశాంత్ కిశోర్ మొదటి విజయం.. బీహార్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో జన్ సూరజ్ అభియాన్ మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపు..

ఈ విషయంలో ఏప్రిల్ 5వ తేదీన సెక్టార్-20 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆయన చెప్పారు. తరువాత విచారణ ప్రారంభమైందని అన్నారు. ఈ బెదిరింపు ఇ-మెయిల్ ద్వారా వచ్చిందని, దానిని పంపించిన వ్యక్తిని కనుగొనేందుకు టెక్నికల్ టీమ్ ను కూడా నియమించామని పేర్కొన్నారు. తమ దర్యాప్తులో ఇమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. నిందితుడు లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశామని తెలిపారు.

గౌతమ్ అదానీకి శరద్ పవార్ మద్దతు.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ టార్గెటెడ్ గా ఉందంటూ వ్యాఖ్యలు..

అనంతరం బాలుడిని నోయిడాలోని జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో అతడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసిందని వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది. కాగా.. ఇ-మెయిల్ పంపిన వ్యక్తి పాఠశాల విద్యార్థి అని తేలింది. ఆ బాలుడు ప్రస్తుతం 11వ తరగతి చదువు పూర్తి చేసి ఈ సెషన్‌లో 12వ తరగతి చదువును ప్రారంభించబోతున్నాడు. 

వార్నీ.. మద్యం మత్తులో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు..తర్వాత ఏమైందంటే ?

కాగా.. ప్రధానమంత్రిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చంపుతామని బెదిరిస్తూ తనకు ఇ-మెయిల్ వచ్చిందని ఓ మీడియా సంస్థ ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత దర్యాప్తు ప్రారంభించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు.