మూఢనమ్మకాలు, చేతబడులు, అతీత శక్తులు మరో కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్‌కు చెందిన కునాల్ త్రివేది, అతని భార్య కవిత, కుమార్తె షిరిన్ సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

మూఢనమ్మకాలు, చేతబడులు, అతీత శక్తులు మరో కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్‌కు చెందిన కునాల్ త్రివేది, అతని భార్య కవిత, కుమార్తె షిరిన్ సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. కునాల్ ఉరివేసుకుని చనిపోగా.. అతని భార్య, కుమార్తె విషం తీసుకుని చనిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు... అలాగే స్పృహతప్పి నేలపై పడివున్న కునాల్ తల్లిని ఆసుపత్రికి తరలించారు. ఆ సూసైడ్ నోట్‌లో తమ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో కునాల్ వివరించాడు.

‘‘ అమ్మా.. నువ్వు నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు.. చేతబడి దాని శక్తి ఏమిటో నీకు చాలా సార్లు చెప్పాను.. అయినా నువ్వెప్పుడూ నన్ను నమ్మలేదు.. నేను మద్యపానం చేస్తుండటం వల్ల అలా అనిపిస్తుందని కొట్టిపారేస్తూ వచ్చావు’’.. ఆత్మహత్య చేసుకోవాలని తన కుటుంబం ఎప్పుడు అనుకోలేదు... అయితే చేతబడి ప్రభావం కారణంగా ఆ పని చేయక తప్పడం లేదు’’ అంటూ అతను తల్లికి తెలుపుతూ ఆ నోట్‌లో రాశాడు. ఎ

వరో చేసిన చేతబడికి తమ కుటుంబం బలి కాబోతోందని తెలిసి.. కునాల్ ముందుగానే తన భార్యా, కూతురితో కలిసి బలన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కునాల్ తల్లి కోలుకుంటనే గానీ అసలు నిజం ఏంటో తెలియదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి ఆత్మహత్య వెనుక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

జూలై నెలలో ఢిల్లీకి చెందిన నారాయణి దేవి కుటుంబం మోక్షం ప్రాప్తిస్తుందని.. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఎవరో స్వామిజీ చెప్పిన మాటలు విని 11 మంది కుటుంబసభ్యులు సామూహికంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఆ 11మంది లాగే... రాంచీలో ఒకే కుటుంబంలోని ఏడుగురు సామూహిక అత్మహత్య

అచ్చం ఢిల్లీలో లాగే.. జార్ఖండ్‌లో ఆరుగురు కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్య

ఢిల్లీ మరణాల వెనక తాంత్రిక కోణం: 11 పైపులు పెట్టింది అతనే

బురారి మరణాలు: దెయ్యాల కోసం స్మశానాల్లో దేవులాట

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఒకరి సమక్షంలో 11మంది సూసైడ్‌, ఎవరతను?

బురారీ సామూహిక మరణాలు: విస్తుపోయే మరిన్ని విషయాలు

ఢిల్లీ డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్: ప్రియాంకకు మాంగల్యదోషం

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఆ 11 మందిని చివరిసారిగా చూసిన ఏకైక వ్యక్తి

ఢిల్లీ సామూహిక మరణాలు: ఓ బాబానే కారణమా..ఆత్మహత్యల గురించి లేఖ

ఢిల్లీ డెత్ మిస్టరీ: ఎంట్రెన్స్‌లో 11 పైపులు, 11 మంది డెడ్ బాడీలు కూడ అలానే...