అచ్చం ఢిల్లీలో లాగే.. జార్ఖండ్‌లో ఆరుగురు కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్య

Mass suicides in Jharkhand
Highlights

జార్ఖండ్‌కు చెందిన మరో కుటుంబం కూడా సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఐదుగురు ఉరేసుకుని చనిపోగా.. మరొకరు భవనం మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు

కొద్దిరోజుల క్రితం దక్షిణ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతటి సంచలనాన్ని కలిగించిందో తెలిసిందే. మూఢనమ్మకాలు, మంత్ర తంత్రలను గుడ్డిగా నమ్మి 11 మంది తమ నిండు ప్రాణాలను పొగొట్టుకున్నారు. ఇంకా ఈ కేసుపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. తాజాగా జార్ఖండ్‌కు చెందిన మరో కుటుంబం కూడా సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది.

హజారీబాగ్‌కు చెందిన నరేశ్ మహేశ్వరి కుటుంబానికి చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.. నరేశ్ ముందుగా తన తల్లిదండ్రులను, భార్య, కుమారుడిని ఉరి తీసి.. అనంతరం తన కుమార్తెను గొంతు నులిమి చంపాడు.. అందరూ చనిపోయ్యారని నిర్ధారించుకున్న తర్వాత ఆయన అదే భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వారు లేఖలో పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

loader