కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను ఇంకా మరచిపోకముందే జార్ఖండ్‌లో ఇదే తరహా విషాదం చోటు చేసుకుంది.

కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను ఇంకా మరచిపోకముందే జార్ఖండ్‌లో ఇదే తరహా విషాదం చోటు చేసుకుంది. రాంచీలోని కాంకే పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన కుటుంబసభ్యులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఐదుగురు పెద్దవారు కాగా.. మరో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది..

ఇదే నెలలో.. ఇదే జార్ఖండ్ రాష్ట్రంలో హజారీబాగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తామంతా బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.