ఇంటికి ముందర ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఇంటి ముందర ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. బాలుడికి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ హత్య వెనుక కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
మీరంతా నా కుటుంబం.. : కార్గిల్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలు..
బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్ర మద్దౌలా పోలీసు సేష్టన్ పరిధిలోని ఓ ప్రాంతంలో 26 ఏళ్ల బబ్లూ దక్ష మిఠాయిల వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. బబ్లూ దక్షకు బంటి కుమార్ అనే స్నేహితుడు ఉన్నాడు. వారి కుటుంబంతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అయితే ఏం జరిగిందో తెలియదు గానీ బబ్లూ కుమారుడిని బంటి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఇంటికి 1 కిలో మీటర్ దూరంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి.. చాతీలో గన్ తో కాల్చాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఇంటికి చేరుకున్నాడు.
బాలికను ‘ఐటెమ్’ అని కామెంట్ చేసిన యువకుడికి 1.5 ఏళ్ల జైలు శిక్ష
బాలుడి కనిపించకుండా పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు బంటి కూడా పోలీసులకు సాయం చేశాడు. అటు వెతకాలని, ఇటు వెతకాలని సూచించాడు. దీంతో అతడి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. నిందితుడిని విచారించగా దారుణాన్ని వెల్లడించాడు.
బీజేపీలోకి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు.. షిండేకు షాక్ తప్పదా?.. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ !
తరువాత ఫౌండ్రీ నగర్ ప్రాంతంలో రక్తం తో తడిసిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దీంతో ఒక్క సారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలుడి హత్యను అతడి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఒక్క సారిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. అనుమానం వచ్చిన ఇతర నిందితులను ప్రశ్నిస్తున్నారు. చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానితులను విచారిస్తున్నా మని, ఘటనపై త్వరలోనే మిగితా వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ సిటీ వికాస్ కుమార్ తెలిపారు.
