తిరువనంతపురం:తన పెంపుడు కుక్కకు ఊర కుక్కతో అక్రమ సంబంధం ఉందని  యజమాని ఆ కుక్కను వదిలేశాడు. ఆ కుక్క ప్రస్తుతం పీపుల్ ఫర్ ఎనిమల్స్ అనే స్వచ్ఛంధ సంస్థ సంరక్షణలో ఉంది. 

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ కూడలి వద్ద పొమోరేనియన్ కుక్క ఉంది.  ఈ కుక్క అదే పనిగా మొరుగుతుండడంతో స్థానికులు పీపుల్ ఫర్ ఎనిమల్(పీఎఫ్ఏ) అనే స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. 

కుక్క ఎందుకు మొరుగుతుందనే విషయమై తెలుసుకొనే ప్రయత్నం చేశారు. కుక్క శరీరంపై గాయాలు ఉన్నాయా పరిశీలిస్తే కుక్క మెడకు ఓ ఉత్తరం కట్టి ఉంది. కుక్క యజమాని ఉత్తరం రాసి ఉంది. తనకు ఈ కుక్క అంటే చాలా ఇష్టమని ఆయన ఆ ఉత్తరంలో రాశాడు. కుక్క వయస్సు మూడేళ్లు.  ఇది ఎంతో మంచిదని ఆ లేఖలో కితాబిచ్చారు.