Asianet News TeluguAsianet News Telugu

షెల్టర్ హోమ్ లోని 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఒకరు మైనర్

షెల్టర్ హోంలో ఉండే 19 ఏళ్ల యువతిపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

A 19-year-old girl was gang-raped in a shelter home.. One of the accused is a minor
Author
First Published Dec 21, 2022, 1:21 PM IST

ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 

ఇతర రాష్ట్రాల లవ్ జిహాద్ వ్య‌తిరేక‌ చట్టాలను అధ్యయనం చేస్తాం: దేవేంద్ర ఫడ్నవీస్

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 19 ఏళ్ల యువతిపై ఓ మైనర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు నిందితులు ఆమెను లైంగికంగా వేధించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతి తన షెల్టర్ హోమ్ సమీపంలో ఉన్న కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి వెళ్లింది. అయితే తిరిగి వచ్చే సమయంలో షెల్టర్ హోమ్ కి వచ్చే దారిని మర్చిపోయింది. ఈ క్రమంలో ఆమె ఓ బొమ్మలు విక్రయించే దుకాణానికి చేరుకుంది.

ఆడుకుందామని పిలిచి.. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడికి ఒడిగట్టిన మైనర్లు.. 

అయితే అక్కడ పని చేసే ఓ మైనర్ ఆమెకు ఓ బొమ్మను చూపించాడు. దీంతో ఆమె ఆకర్షణకు గురయ్యింది. ఆ బొమ్మ ఆశచూపి ఆ మైనర్ ఆమెను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఓ మురికి గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. అయితే బాధితురాలు వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని ఓ అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకుంది. అక్కడికి పోలీసు పెట్రోలింగ్‌ సిబ్బంది చేరుకోవడంతో వారితో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు వివరించింది. ఆమెను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. 

కోవిడ్ రూల్స్ పాటించండి.. లేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయండి: రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి లేఖ

తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మైనర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బాధితురాలి ముందుకు తీసుకొచ్చారు. ఆమె ఆ ముగ్గురు నిందితులను గుర్తించింది. వారే తనపై అత్యాచారానికి ఒడిగట్టారని చెప్పింది. ఇందులో ఒకరిని అనిరుధ్ చౌదరిగా, మరొకరిని అభిమన్యు షాగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో దుకాణాలు నడుపుతున్నారు. మైనర్ నిందితుడిని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios