మో చేతులు నల్లగా ఉన్నాయా..? ఈ ట్రిక్ తో తొలగించొచ్చు..!
మోచేతులు నల్లగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... మార్కెట్లో లభించే క్రీములతో పని లేకుండా.. కేవలం కొన్ని సహజ పద్దతిలో సులభంగా ఆ నలుపును వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....
elbow
అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.దాని కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. అయితే.. ఎన్ని క్రీములు వాడినా చాలా మందికి మో చేతులు మాత్రం నల్లగా కనపడుతూ ఉంటాయి. ఇలా మోచేతులు నల్లగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... మార్కెట్లో లభించే క్రీములతో పని లేకుండా.. కేవలం కొన్ని సహజ పద్దతిలో సులభంగా ఆ నలుపును వదిలించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....
elbow
1.
నిమ్మరసం: నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇప్పుడు నిమ్మరసాన్ని మోచేతులకు పట్టించి రెండు నిమిషాల పాటు బాగా మర్దన చేస్తే మోచేతులపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోయి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
2.
పెరుగు , ఉప్పు: మోచేతులపై ఉన్న నల్లటి మచ్చలను పోగొట్టడానికి పెరుగు ఉత్తమ మార్గం. దీని కోసం, ఒక గిన్నెలో పెరుగు ,ఉప్పు కలపండి . మీ నల్లటి మోచేతులపై అప్లై చేసి 10-15 నిమిషాలు ఉంచి, తర్వాత చల్లని నీటితో కడిగితే నలుపు పోతుంది.
elbow dark
3.అలోవెరా జెల్: అలోవెరా జెల్: నల్లటి మోచేతుల నుండి బయటపడటానికి, కలబందలోని జెల్‌ను తీసుకుని మోచేతులపై అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా నిత్యం చేస్తుంటే నల్లదనం పోతుంది. అలోవెరా జెల్ చర్మాన్ని పునరుజ్జీవింపజేసి కాంతివంతం చేస్తుంది.
4.
శెనగ పిండి , పాలు: శెనగ పిండితో కొద్దిగా పాలను కలిపి పేస్ట్‌లా చేసి నల్లటి మోచేతులపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.