MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మిగిలిపోయిన మజ్జిగతో ఏమేమి చేయొచ్చు?

మిగిలిపోయిన మజ్జిగతో ఏమేమి చేయొచ్చు?

ఎండాకాలంలో మజ్జిగను రోజూ  తాగుతుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మజ్జిగ మిగిలిపోతుంటుంది. అయితే చాలా మంది ఇలా మిగిలిపోయిన మజ్జిగను తాగడానికి ఇష్టపడరు. ఇంకేముంది దీన్ని పారేస్తుంటారు. కానీ మిగిలిపోయిన మజ్జిగతో మీరు ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. దీనితో మీరు టేస్టీ టేస్టీ వంటలు తయారుచేయొచ్చు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 02 2024, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆకలి తగ్గి దాహం బాగా పెరుగుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి కారణంగా గొంతు మరింత పొడిబారుతుంది. అలాగే చెమట వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ బాగా తగ్గుతుంది. దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్లతో పాటుగా మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లను తాగుతుంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. 
 

25

అయితే ప్రతి డ్రింక్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ఎండాకాలంలో చాలా మంది మజ్జిగను తాగడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి దీనిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అలాగే దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు.  అందుకే చాలా మంది అవసరమైన దానికంటే మజ్జిగను కాస్త ఎక్కువగానే తయారుచేస్తారు. కానీ కొన్ని కొన్ని సార్లు మజ్జిగను ఎవరూ తాగకపోవడంతో అది అలాగే మిగిలిపోతుంది. అయితే మిగిలిపోయిన మజ్జిగ మరుసటి రోజుకల్లా మరింత పుల్లగా మారుతుంది. అందుకే దీన్ని ఎవరూ తాగాలనుకోరు. ఇంకేముంది డస్ట్ బిన్ లో పారేస్తారు. కానీ మిగిలిపోయిన మజ్జిగను ఉపయోగించి మీరు ఎన్నో టేస్టీ టేస్టీ వంటకాలను తయారుచేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35


గ్రేవీ తయారు చేయడానికి.. 

ఈసారి గ్రేవీని తయారు చేయడానికి పెరుగుకు బదులుగా మజ్జిగను వాడండి. అవును మజ్జిగ గ్రేవీ రుచిని బాగా పెంచుతుంది. మజ్జిగను వాడితే గ్రేవీ రంగు కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ రుచి, రంగు ఎంత రుచిగా ఉంటుందో మీరు ఊహించలేరు.  మజ్జిగను ఉపయోగించడం వల్ల గ్రేవీ చాలా మందంగా మారుతుంది. అందుకే చాలా మంది పెరుగుకు బదులుగా మజ్జిగనే గ్రీవికి ఉపయోగిస్తారు. అలాగే మాంసాహారం చేయడానికి కూడా మజ్జిగను ఉపయోగించొచ్చు. అయితే మాంసాహారంలో మజ్జిగను ఉపయోగించే ముందు రుచి చూసి ఆ తర్వాత ఆహారంలో కలుపుకోవాలి.
 

45

మజ్జిగతో దోశ పిండి.. 

దోశపిండిని తయారు చేయడానికి మీరు బటర్ మిల్క్ ను కూడా ఉపయోగించొచ్చు. దీని కోసం మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ముందుగా దోశపిండిని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకోండి. అయితే ఇది మిక్సీ పడుతున్నప్పుడు వాటర్ కు బదులుగా మజ్జిగను వేసి కలపండి.

55
<p>dosha</p>

<p>dosha</p>

ఇలా చేయడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి దోశ రుచిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. మజ్జిగను కలపడం వల్ల దోశ మెత్తగా, రుచిగా ఉంటుంది. అయితే మీరు దీని పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 1 గ్రాములో అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ఇయర్ రింగ్స్
Recommended image2
Mehandi Designs: చిన్నారుల కోసం క్యూట్ మెహెందీ డిజైన్స్.. ట్రై చేయండి
Recommended image3
Silver Toe Rings: డైలీవేర్ కి ట్రెండీ డిడైన్ లో వెండి మెట్టెలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved