దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, ఉన్నాయని తెలిపింది.
తెలంగాణ , ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా తొమ్మిది రాష్ట్రాలు కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటించారు.
ఐదేండ్ల పిల్లాడు పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు.. అతనికి ఈ ఉద్యోగం ఎలా వచ్చిందంటే..?
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ (డీఎస్ పీఈ) చట్టం-1946 లోని సెక్షన్ 6 ప్రకారం.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తన పరిధిలో దర్యాప్తు నిర్వహించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి అవసరమని ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.
శ్రీరామునిపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..
డీఎస్ పీఈ చట్టం-1946 లోని సెక్షన్ 6 నిబంధన ప్రకారం.. నిర్దిష్ట కేటగిరీల వ్యక్తులపై నిర్దిష్ట తరగతి నేరాల దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి సాధారణ సమ్మతిని మంజూరు చేశాయని తెలిపారు. అవి నిర్దిష్ట విషయాలను నమోదు చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఏజెన్సీకి వీలు కల్పిస్తాయని తెలిపారు.
మత్తుమందు ఇచ్చి 5వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, స్కూల్ ప్యూన్ అరెస్ట్
సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు.
