Surguja: నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేశారు. ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ పోస్టులో నియమించడంలో అర్థం ఏమిటనే ప్రశ్న కూడా చాలా మంది మదిలో మెదులుతున్న ప్ర‌శ్న‌..!  

5-year-old boy posted as child constable: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఐదేళ్ల బాలుడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియ‌మితులై విధులు నిర్వహిస్తున్నాడు. ఆ చిన్నారి నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేశారు. ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ పోస్టులో నియమించడంలో అర్థం ఏమిటనే ప్రశ్న కూడా చాలా మంది మదిలో మెదులుతున్న ప్ర‌శ్న‌..! 

చిన్నారి కానిస్టేబుల్ కావ‌డం వెనుక క‌థ ఇది.. 

పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న చిన్నారి తండ్రి చనిపోవడంతో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసు కానిస్టేబుల్‌గా ఉన్న చిన్నారి తండ్రి చనిపోవడంతో అతడిని కానిస్టేబుల్‌గా నియమించినట్లు అధికారులు చెబుతున్నారు. రాజ్‌కుమార్‌ రాజ్‌వాడే ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు అని ఎస్పీ భావా గుప్తా తెలిపారు. ఇప్పుడు ఆయన కుమారుడు నమన్ రాజ్వాడే చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. అతని తండ్రి మరణం తర్వాత, జార్ఖండ్ పోలీసులు 5 ఏళ్ల నమన్‌ను కానిస్టేబుల్‌గా నియ‌మించారు.

రోడ్డు ప్రమాదంలో చిన్నారి కానిస్టేబుల్ తండ్రి మృతి 

నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ రాజ్వాడే 2021 సెప్టెంబర్ 3న రోడ్డు ప్రమాదంలో మరణించారు. కానిస్టేబుల్ భార్య, 5 ఏళ్ల కుమారుడు నమన్ లు.. రాజ్ కుమార్ రాజ్వాడేపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఛత్తీస్‌గఢ్‌ పోలీసు శాఖ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. జీతభత్యాలు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు రాజ్ కుమార్ కుమారుడు నమన్ ను కారుణ్య నియామకం కింద చైల్డ్ కానిస్టేబుల్ గా నియమించారు.

ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ గా నియమించడంలో అర్థమేంటి..? 

అయితే ఐదేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ పోస్టుకు నియమించడంలో అర్థం ఏమిటనే ప్రశ్న కూడా పలువురి మదిలో మెదులుతోంది. నిబంధనల ప్రకారం ప్రస్తుతం చైల్డ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న నమన్ కు 18 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి కానిస్టేబుల్ హోదా లభిస్తుంది. అదే సమయంలో ఐదేళ్ల చిన్నారికి ఎస్పీ భావనా గుప్తా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భావనా గుప్తా నమన్ రాజ్వాడేకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఇప్పుడు మీరు కూడా పోలీస్ అయ్యారని చెప్ప‌టం క‌నిపించింది.

Scroll to load tweet…