పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సంభవించిన ‘‘గజ‘‘ తుఫాను తమిళనాడుకు అపారనష్టాన్ని మిగిల్చింది. తుఫాను ధాటికి ఇప్పటి వరకు 45 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సంభవించిన ‘‘గజ‘‘ తుఫాను తమిళనాడుకు అపారనష్టాన్ని మిగిల్చింది. తుఫాను ధాటికి ఇప్పటి వరకు 45 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అనధికారికంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

బలమైన ఈదురు గాలుల కారణంగా 1.70 లక్షల చెట్లు నేలకూలగా.. 347 ట్రాన్స్‌ఫార్మర్లు, 39,938 స్తంభాలు ధ్వంసమయ్యాయి. 4730 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో 2.49 లక్షల మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.

మరోవైపు తుఫాను ప్రభావం అధికంగా ఉన్న తిరువారూరులో నష్టం అంచనాకు కూడా అందడం లేదు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆస్తినష్టం అంచనాపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

తీరం దాటిన ‘‘గజ’’.. 11 మంది మృతి, భారీ ఆస్తినష్టం

‘‘గజ’’ తీరం దాటేది నేడే...తమిళనాడులో హై అలర్ట్

జీఎస్ఎల్వీ మార్క్3-డీ2 ప్రయోగానికి ‘‘గజ’’ ఒప్పుకుంటుందా..?

తీవ్రరూపం దాల్చిన ‘‘గజ’’: కడలూరుకు రెడ్ అలర్ట్

దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు