Asianet News TeluguAsianet News Telugu

తీరం దాటిన ‘‘గజ’’.. 11 మంది మృతి, భారీ ఆస్తినష్టం

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను వణికించిన ‘‘గజ’’ తీరాన్ని దాటింది.. శుక్రవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరాన్ని దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 

cyclone Gaja Hits tamilnadu
Author
Chennai, First Published Nov 16, 2018, 10:58 AM IST

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను వణికించిన ‘‘గజ’’ తీరాన్ని దాటింది.. శుక్రవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో నాగపట్నం-వేదారణ్యం మధ్య తీరాన్ని దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో తమిళనాడు చిగురుటాకులా వణికిపోయింది..

110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచింది. చాలా ప్రాంతాలు ముంపునకు గురవ్వడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

మరోవైపు తుఫాను కారణంగా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లా అధిరామ్‌పట్నంలో అత్యధికంగా 16 సెం.మీ వర్షపాతం నమోదైంది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు..

ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. ‘‘గజ’’ ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.. ముందస్తు చర్యల్లో భాగంగా 80 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగపట్నం, కడలూరులలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని బీచ్‌ల వద్ద ప్రవేశాన్ని నిషేధించారు.

అటు ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తాపైనా ‘‘గజ’’ ప్రభావం చూపుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ప్రభుత్వం మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేసింది. 

 

 

‘‘గజ’’ తీరం దాటేది నేడే...తమిళనాడులో హై అలర్ట్

జీఎస్ఎల్వీ మార్క్3-డీ2 ప్రయోగానికి ‘‘గజ’’ ఒప్పుకుంటుందా..?

తీవ్రరూపం దాల్చిన ‘‘గజ’’: కడలూరుకు రెడ్ అలర్ట్

దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు
 

Follow Us:
Download App:
  • android
  • ios