Asianet News TeluguAsianet News Telugu

‘‘గజ’’ తీరం దాటేది నేడే...తమిళనాడులో హై అలర్ట్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘గజ’’ తుఫాను ఇవాళ తీరం దాటనుంది. ఈ రోజు సాయంత్రం కడలూరు-పంబన్ మధ్య ‘‘గజ’’ తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది

cyclone gaja ready to hit tamilnadu today
Author
Chennai, First Published Nov 15, 2018, 7:50 AM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘గజ’’ తుఫాను ఇవాళ తీరం దాటనుంది. ఈ రోజు సాయంత్రం కడలూరు-పంబన్ మధ్య ‘‘గజ’’ తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.. ప్రస్తుతం అది చెన్నైకి 300 కి.మీ, నాగపట్నానికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది..

ఇది పశ్చిమ నైరుతీ దిశగ పయనించి తీవ్ర తుఫానుగా మారి... తర్వాత బలహీనపడి తుపానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. ‘‘గజ’’ తమిళనాడుపై పెను ప్రభావం చూపుతోంది.. కడలూరు, నాగపట్నం, కారైక్కాల్, తిరువారూరు, తంజావూరు, పుదుకోట, రామనాథపురం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను తీవ్రత దృష్ట్యా నేడు ఈ ఏడు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు ‘‘గజ’’ బలపడటంతో తూర్పు నావికా దళం అప్రమత్తమైంది... ఐఎన్ఎస్ రణ్‌వీర్, కంజార్ యుద్ధనౌకలతో పాటు హెలికాఫ్టర్లు సిద్ధం చేసింది.. బాధితులు, అత్యవసర వస్తువులు తరలింపునకు సిబ్బందిని రెడీ చేస్తోంది.

మరోవైపు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని... నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తీవ్రరూపం దాల్చిన ‘‘గజ’’: కడలూరుకు రెడ్ అలర్ట్

దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు

Follow Us:
Download App:
  • android
  • ios