దేశంలోని సమాచార వ్యవస్థకు మరింత చేయూతనిచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ-మార్క్ 3 డీ2 ప్రయోగానికి ‘‘గజ‘’’ తుఫాను ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాను మరింత బలపడి...రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 530, నాగపట్నానికి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

పశ్చిమ, వాయువ్య దిశలుగా కదులుతూ.. రేపు మధ్యాహ్నం పంబన్-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు రాకెట్ ప్రయోగానికి ఇబ్బందులు కలిగించవచ్చని ఇస్రో అంచనా వేస్తోంది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ నిన్న ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అ

నంతరం ఆయన మాట్లాడుతూ... వాతావరణం అనుకూలిస్తే జీఎస్ఎల్వీ ప్రయోగం అనుకున్న సమయానికి ఉంటుందని... లేని పక్షంలో ప్రయోగాన్ని మరో రోజు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

3600 కిలోల బరువున్న జీశాట్-29 రాకెట్ కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 3.38 గంటలకు ప్రారంభమై 25.30 గంటల పాటు కొనసాగి.. రాకెట్‌లోని రెండో ఎల్ 110 దశ, మూడో సీ25 క్రయోజనిక్ దశలో ద్రవ ఇంధనం నింపనున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 5.08కి శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3 కక్ష్యలోకి చేరనుంది. 

తీవ్రరూపం దాల్చిన ‘‘గజ’’: కడలూరుకు రెడ్ అలర్ట్

దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు