పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాను మరింత బలపడి...రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 530, నాగపట్నానికి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

పశ్చిమ, వాయువ్య దిశలుగా కదులుతూ.. రేపు మధ్యాహ్నం పంబన్-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటలు 7 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని... గజ తుఫాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

2.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడతాయని... సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. కడలూరు జిల్లాపై గజ పెను ప్రభావం చూపిస్తుందని హెచ్చిరించింది.. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.

కడలూరు సహా నాగపట్నం, తంజావూరు, తిరువారూరు, పుదుక్కోట, కారైకల్, రామనాథపురం జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా కడలూరు జిల్లాలో 250 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. ప్రత్యేక ఎఫ్ఎం ద్వారా తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. 

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు

దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక