సరిగ్గా కళ్లు కూడా తెరవని పసికందుని పట్టుకొని కర్రలతో కొట్టి చంపారు. ఈ దారుణ సంఘటన గుజరాత్ లోని మేఘని నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో... పసికందు ప్రాణాలు మింగేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...మేఘని నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి పటని మరో ఇద్దరు మహిళలతో కలిసి నివసిస్తోంది. గురువారం రాత్రి వారి ఇంట్లోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. ఆ మహిళలపై దాడి చేశారు. అనంతరం ఇంట్లో నిద్రిస్తున్న 20 రోజుల పసికందుపై కూడా కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మి, ఆమె సోదరికి గాయాలయ్యాయి. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు  సతీశ్‌ పటనీ, హితేశ్‌లుగా గుర్తించారు. వీరికి గతంలోనూ క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉందని పోలీసులు చెప్పారు. మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.