కొచ్చి: థాయ్ లాండ్ జాతీయరాలిపై అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 46 ఏళ్ల థాయ్ లాండ్ జాతీయురాలిపై కేరళలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు .వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారంనాడు చెప్పారు.

మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్త్ కేరళ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న తర్వాత నిందితులు మొహమ్మద్ ఇన్సాఫ్, అతని మిత్రుడు అన్సరుద్దీన్ ను అరెస్టు చేశారు. వారు మాలప్పురం జిల్లా కొండొట్టికి చెందినవారు. 

థాయ్ లాండ్ కు చెందిన మహిళ ఇన్సాఫ్ కు ఫేస్ బుక్ స్నేహితురాలు. ఏడేళ్ల క్రితం వారిద్దరు ఫేస్ బుక్ లో మిత్రులుగా మారారు. మలప్పురం పాఠశాలలో తన బిడ్డను ఆమె చేర్చింది. తన పాపను చూడడానికి ఇటీవల బ్యాంగ్ కాక్ నుంచి వచ్చి హోటల్లో బస చేసింది. 

ఆ మహిళను కలవడానికి తన మిత్రుడు అన్సరుద్దీన్ తో కలిసి ఇన్సాఫ్ వచ్చాడు. ఇద్దరు కలిసి హోటాల్ గదిలో ఆమెపై అత్యాచారం చేశారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు.