మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ నేత(వీడియో)

First Published 17, Apr 2018, 1:26 PM IST
No ticket for BJP leader, cries like a baby
Highlights
వెక్కిళ్లు పెట్టి మరీ ఏడ్చేశారు

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టికెట్ రాలేదని బీజేపీ నేత కన్నీరు పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ 82 మంది పేర్లతో కూడిన రెండో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో శశిల్ జీ నమోషి పేరు లేదు. గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. నమోషి స్థానంలో సీబీ పాటిల్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా నమోషి.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీంతో ఒక్కసారిగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. 

 

ఈ సమయంలో నమోషి అనుచరులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. గత పన్నేండు సంవత్సరాల నుంచి నమోషి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గుల్బర్గా దక్షిణం లేదా గుల్బర్గా ఉత్తరం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గానికి తన పేరు ఎంపిక చేస్తారని నమోషి భావించారు. కానీ ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా తన పేరును ఖరారు చేయకపోవడంతో నమోషి తీవ్ర ఆవేదన చెందారు. 

loader