లారెన్స్ నన్ను వాడుకున్నాడు.. తన కారణంగా బెల్లంకొండ విలన్ అయ్యాడు: శ్రీరెడ్డి

srireddy sensational comments on raghava lawrence and bellamkonda
Highlights

తాజాగా ఓ ప్రముఖ నటుడు, డైరెక్టర్ పై వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎవరంటే రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన  రాఘవ ఇప్పుడు కోలివుడ్ లో నటుడిగా, దర్శకుడిగా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు

కాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి తనకు అనిపించిన ప్రతిసారి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం కొందరు సినిమా సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇకపై కోలివుడ్ ను టార్గెట్ చేస్తానని చెప్పిన శ్రీరెడ్డి ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ ను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టింది. తాజాగా ఓ ప్రముఖ నటుడు, డైరెక్టర్ పై వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎవరంటే రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన రాఘవ ఇప్పుడు కోలివుడ్ లో నటుడిగా, దర్శకుడిగా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.

తన సేవా కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉండే లారెన్స్ ను టార్గెట్ చేసి నేరుగా అతడి పేరుని చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ''కొందరి స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ ను మసాబ్ ట్యాంక్ వద్ద హోటల్ గోల్కొండ లాబీలో కలిశాను. ఆయన వెంటనే నన్ను అతడి రూమ్ కి తీసుకెళ్లాడు. నేను రూమ్ లోకి ప్రవేశించగానే రాఘవేంద్రస్వామి ఫోటో కొన్ని రుద్రాక్షలు కనిపించాయి. నేను వాటిని చూసి ఆశ్చర్యపోయాను. తరువాత అతడు పేద కుటుంబం నుండి వచ్చానని కొత్తవారికి అవకాశాలు ఇస్తుంటానని చెప్పి నన్ను ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. తను పేదవారికి చేస్తోన్న సహాయం తెలుసుకొని నేను కూడా మంచి అభిప్రాయానికి వచ్చేశాను.

కానీ అప్పుడే అతడి అసలు రంగు బయట పెట్టడం మొదలుపెట్టాడు. నా శరీరంలో ఒక్కో భాగం చూపించమని అడుగుతూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత నన్ను వాడుకున్నాడు. నాకు ఆఫర్ కన్ఫర్మ్ అని చెప్పాడు. కానీ చివరికి బాధాకరంగా ముగిసింది. నేను ఆయనతో స్నేహం కంటిన్యూ దాని కారణంగా నిర్మాత బెల్లంకొండ నాకు శత్రువుగ మారాడు' అంటూ వెల్లడించింది.   

loader