జిమ్ కి వెళ్లకుండా బరువు తగ్గడం చాలా కష్టం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అంతేకాదు.. తిండి పూర్తిగా మానేయాలి.. కడుపు మాడ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు.
ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఆ బరువు తగ్గించుకోవడానికి చాలా మంది తిండి తినడం మానేస్తారు.. లేదంటే.. జిమ్ కి వెళ్లి కష్టపడతారు. జిమ్ లో బరువులు ఎత్తుతూ, కఠిన వ్యాయామాలు చేసి బరువు తగ్గుతారు. అయితే.. ఓ యువతి మాత్రం జిమ్ కి వెళ్లకుండానే ఇంట్లోనే 30 కేజీల బరువు తగ్గింది. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాలతోనే తాను బరువు తగ్గానని ఆమె చెప్పడం విశేషం. మరి, ఆ బరువు ఎలా తగ్గిందో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
జిమ్ కి వెళ్లకుండా బరువు తగ్గడం చాలా కష్టం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అంతేకాదు.. తిండి పూర్తిగా మానేయాలి.. కడుపు మాడ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ.. లైఫ్ స్టైల్ లో చిన్న మార్పులు చేసుకొని కూడా ఈజీగా బరువు తగ్గవచ్చని నిరూపించింది ఉదితా అగర్వాల్. బరువు తగ్గించుకునే క్రమంలో తాను ఎలాంటి అలవాట్లను అలవాటు చేసుకుందో కూడా ఆమె సోషల్ మీడియాలో వివరించింది.
1. ప్రతిరోజూ డీటాక్స్ నీరు
ఉదితా ఇంట్లో తయారుచేసిన డీటాక్స్ డ్రింక్ తాగిందట. జీలకర్ర (జీలకర్ర), అజ్వైన్ (క్యారమ్ గింజలు), సోంపు, మెంతులు నీటిలో మరిగించి.. ఆ నీటితో తన డేని మొదలుపెట్టానని ఆమె చెప్పింది. ఇది ఉబ్బరాన్ని నివారించడంలో సహాయపడిందని, తన జీర్ణక్రియ మెరుగుపడిందని చెప్పింది. ఈ డీటాక్స్ డ్రింక్ తన బరువు తగ్గించడంలో బాగా హెల్ప్ చేసిందని వివరించింది.
2. ఒక్క చీట్ డే కూడా లేకుండా..
బరువు తగ్గే క్రమంలో ఒక్కోసారి జంక్ ఫుడ్ తినాలి అనే కోరిక చాలా మందిలో కలుగుతుంది. అయితే.. తాను మాత్రం ఒక్క రోజు కూడా చీట్ మీల్ చేయలేదని ఉదితా చెప్పింది. తాను అనుకున్నదానికి మాత్రమే కట్టుబడి ఉన్నట్లు చెప్పింది.
3.ఒక్క రోజులో బరువు తగ్గలేం..కానీ మానసికంగా దృఢంగా ఉండాలి..
ఈ బరువు తగ్గే ప్రయాణంలో ప్రతిరోజూ బరువులో తేడాలు కనిపించకపోవచ్చు. కానీ, దానికే కృంగి పోకూడదని ఉదితా చెప్పింది. ఒక్కోసారి బరువు తగ్గడం కాదు.. పెరుగుతూ కూడా కనపడతామని, అయినా కూడా బాధపడకుండా.. మన ప్రయాణం కొనసాగించాలని చెప్పింది. దాని వల్లే తాను బరువు తగ్గినట్లు చెప్పింది.
4. ప్రయాణంలో ఇంట్లో తయారుచేసిన భోజనం
పనుల కోసం లేదా కార్యక్రమాల కోసం బయటకు వెళ్లినా, బయట అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ తినకుండా ఉండటానికి ఆమె ఇంటి నుంచే హెల్దీ ఫుడ్ ని తీసుకొని వెళ్లేదట.దీని వల్ల బయటి ఫుడ్ తినకుండా ఉండేదట.
5. చియా గింజల నీరు + హైడ్రేషన్
రోజువారీ 3–4 లీటర్ల నీరు త్రాగడంతో పాటు, చియా విత్తనాలను అర లీటరు నీటిలో నానబెట్టి, అదనపు డీటాక్స్ పానీయంగా రోజంతా తాగేదట. ఈ చియా సీడ్స్ కూడా బరువు తగ్గించడంలో బాగా సహాయపడ్డాయని ఆమె చెప్పింది
6. స్నాక్స్ లేకుండా టీ
ఆమె తన రోజువారీ కప్పు టీని ఆస్వాదించింది, కానీ వేయించిన లేదా ప్యాక్ చేసిన స్నాక్స్‌తో జత చేయకుండా, కేవలం టీతో సరిపెట్టుకుంది. దీని వల్ల శరీరంలో అదనపు కేలరీలు చేరుకుండా సహాయపడింది
7. మైదా లేదు, కానీ చక్కెర నిషేధం కూడా లేదు
ఉదిత తన ఆహారం నుండి శుద్ధి చేసిన పిండి (మైదా)ను తొలగించింది కానీ చక్కెరను పూర్తిగా తగ్గించలేదు. కాకపోతే చాలా మితంగా చక్కెర తీసుకోవడం అలవాటు చేసుకుంది. తర్వాతర్వాత నెమ్మదిగా దానిని కూడా తగ్గించేసింది.
8. భోజనానికి ముందు నీరు త్రాగుట
ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగటం అనే సరళమైన కానీ ప్రభావవంతమైన అలవాటు ఆమె అతిగా తినకుండా ఉండటానికి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉండటానికి సహాయపడింది. ఈ మార్పులతోనే తాను ఈజీగా బరువు తగ్గానని ఉదితా అగర్వాల్ చెప్పడం గమనార్హం.
