Asianet News TeluguAsianet News Telugu

ముఖంపై ముడతలు వచ్చాయా? బొప్పాయి ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి.. తగ్గిపోతాయి

బొప్పాయి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గిస్తుంది. అలాగే ముఖంపై ఏర్పడ్డ ముడతలను కూడా పోగొడుతుంది. 
 

 Skin Care:  papaya face packs for healthy and glow skin rsl
Author
First Published Apr 28, 2023, 4:32 PM IST


బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా. అవును బొప్పాయి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పొడి చర్మాన్ని లోపలి నుండి తేమగా చేయడమే కాకుండా సెల్యులార్ దెబ్బతినకుండా కాపాడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఇ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖం మరింత ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది.

బొప్పాయిలోని పాపైన్  అనే ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. ప్రోటీన్ కరిగే పాపైన్ ఎన్నో ఎక్స్ఫోలియేటింగ్ ఉత్పత్తులలో ఉంటుంది. ఈ ఉత్పత్తులు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుస్తాయి. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. పాపైన్ దెబ్బతిన్న కెరాటిన్ ను కూడా తొలగిస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోతుంది. ముడతలకు కారణమవుతుంది.

బొప్పాయి చర్మాన్ని లోపలి నుండి తేమ చేస్తుంది. అలాగే చర్మ ఆకృతిని కూడా సరిచేస్తుంది. అంతేకాదు ఇది పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బొప్పాయిని ముఖానికి ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం రెండు టీస్పూన్ల బొప్పాయి పేస్ట్ లో కొద్దిగా రోజ్ వాటర్ ను ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను వేయండి. దీన్ని బాగా మిక్స్ చేసి ఈ ప్యాక్ ను ముఖానికి, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ అందమైన, మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల ముఖంపై మచ్చలు, ముడతలు కూడా తగ్గుతాయి.

అరకప్పు బొప్పాయి పేస్ట్ లో  రెండు టీస్పూన్ల పాలు బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు వేసుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios