ఈ ఒక్క పనిచేస్తే వాటర్ ట్యాంకులో నాచు ఈజీగా పోతుంది..

వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. లేదంటే అవి మురికిగా మారడమే కాకుండా.. ట్యాంక్ అడుగుభాగంలో నాచు కూడా ఏర్పడుతుంది. ఇప్పటికీ మీ వాటర్ ట్యాంల్ లో నాచు ఏర్పడితే.. దాన్ని ఎలా శుభ్రం చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

How to clean the water tank easily? rsl

నేడు ప్రతి ఒక్కరి ఇంటిపై వాటర్ ట్యాంకులు ఖచ్చితంగా ఉంటున్నాయి. అయితే చాలా మంది ఈ వాటర్ లో నీళ్లు నిండుగా ఉన్నాయా? లేవా? అని మాత్రమే చూసుకుంటారు. అసలు అది శుభ్రంగానే ఉందా? లేదా? అని మాత్రం చూసుకోరు. దీనివల్ల ఈ వాటర్ ట్యాంక్ లు మురికిగా మారుతాయి. అంతేకాదు చాలా రోజులుగా క్లీన్ చేయకపోవడం వల్ల దీనిలో నాచు కూడా ఏర్పడుతుంది. ఇలాంటి వాటర్ ను ఉపయోగించడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మీకు తెలుసా? చాలా రోజులుగా నీరు నిల్ల ఉండటం వల్ల అవి తొందరగా మురికిగా మారుతాయి. దీనిలో ప్రమాదకరమైన దోమలు, కీటకాలు వృద్ధి చెందే ప్రమాదం కూడా ఉంది. ఇకపోతే ఈ వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం అంత సులువైన పనేం కాదు. ఇది నిజమే కానీ.. మీరు కొన్ని సింపుల్ టిప్స్ తో వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆలంతో శుభ్రం చేయండి:  ఆలం నీళ్లను, వాటర్ ట్యాంక్ లను శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆలంతో వాటర్ ట్యాంకును శుభ్రం చేయాలంటే ముందుగా మీ వాటర్ ట్యాంకును సగం వరకు ఖాళీ చేయండి. ఇప్పుడు ఒక బకెట్ నీటిలో ఆలం వేసి కాసేపు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఈ వాటర్ ను వాటర్ ట్యాంక్ లో పోయండి. ఆలం వాటర్ ట్యాంకులోకి మురికినంతా అడుగున బాగానికి చేరేలా చేస్తుంది. కొద్దిసేపు దీన్ని వదిలేసి తర్వాత ట్యాంకును పూర్తిగా ఖాళీ చేయండి. ఆ తర్వాత ట్యాంక్ పై భాగంలో ఉన్న మురికిని శుభ్రమైన క్లాత్ తో క్లీన్ చేయండి. 

హైడ్రోజన్ పెరాక్సైడ్ :  హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఇంట్లోని వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. అయితే దీని వాడాలంటే మీరు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక పెద్ద వాటర్ ట్యాంకును క్లీన్ చేయడానికి ట్యాంక్ నీటిలో 500 మి.లీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వేయండి. దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత ఇంట్లోని అన్ని ట్యాప్ లను ఆన్ చేయండి. ట్యాంకులోని నీరంతా పోయేలా చేయండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న వాటర్ కుళాయి ద్వారా బయటకు వచ్చినప్పుడు కుళాయిని కూడా శుభ్రపడుతుంది. వాటర్ ట్యాంక్ లో మిగిలిపోయిన వాటర్ ను క్లాత్ తో శుభ్రం చేయండి. ట్యాంకులోని నీరు పూర్తిగా ఆరిన తర్వాత నీటిని నింపండి. 

వాటర్ ట్యాంక్ క్లీనర్ : వాటర్ ట్యాంక్ క్లీనర్లుగా బ్లీచ్ లిక్విడ్, పౌడర్ ను ఉపయోగిస్తారు. వీటితో కూడా మీరు ఇంటిపై ఉండే వాటర్ ట్యాంక్ ను ఈజీగా క్లీన్ చేయొచ్చు. దీన్ని ఉపయోగించడానికి ముందుగా 400 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ లేదా 300 గ్రాముల లిక్విడ్ బ్లీచ్ ను తీసుకోండి. ఇప్పుడు దీన్ని 10 లీటర్ల నీటిలో కలపండి. 3 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని వాటర్ ట్యాంకులో పోయండి. 15 నిమిషాల తర్వాత వాటర్ ట్యాంకును ఖాళీ చేయండి. ఈ విధంగా మీరు చాలా ఈజీగా వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేయొచ్చు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios