వాతావరణంలో ఉండే తేమ కారణంగా బియ్యం పప్పుల్లో కీటకాలు, బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి. మరి, ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్ లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా మందికి నచ్చే సీజన్ ఇది. అయితే.. ఈ కాలంలో వచ్చే సమస్యలు కూడా అంతే ఉంటాయి. ఈ సీజన్ లో చాలా మంది వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఇది మాత్రమే కాదు.. కిచెన్ లో వంట, పప్పు దినుసులు కూడా దెబ్బతింటాయి. మనం ఎంత జాగ్రత్తగా నిల్వ చేసినా కూడా బియ్యం, పప్పులకు పరుగులు పడుతూ ఉంటాయి. ఈ కాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బియ్యం పప్పుల్లో కీటకాలు, బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి. మరి, ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ వచ్చిన తర్వాత వాటిని ఎలా తరిమి కొట్టాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

1.ఎండలో ఆరబెట్టడం...

మీరు బియ్యం, పప్పులను ఎండ బాగా వచ్చి సమయంలో ఆ ఎండలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులో చేరిన తేమ మొత్తం తొలగిపోతుంది. వర్షాకాలం రావడానికి ముందు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వొచ్చు. వర్షాలు పడటానికి ముందే బాగా ఎండలు వచ్చిన సమయంలో ఆరు బయట ఎండలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల తేమ మొత్తం పోతుంది. దీంతో.. ఎక్కువ రోజులు ధాన్యం, పప్పులు పాడవ్వకుండా.. పురుగుల పట్టకుండా క్షేమంగా ఉంటాయి. మంచిగా నిల్వ చేయగలం.

2. వేప ఆకుల వైద్యం

వేపాకులు బాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. కొన్ని శాస్త్రాల్లో వేపఆకులు యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటాయని పేర్కొంటారు. కొన్ని ఎండిన ఆకులను ధాన్యాలతో పాటు సంచుల్లో, మీరు నిల్వ చేసిన డబ్బాల్లో వేయాలి. ఇలా చేయడం వల్ల పురుగులు పోవడమే కాకుండా.. మళ్లీ పట్టకుండా ఉంటాయి. అయితే, ఈ వేపాకులను నెలకొకసారి మారుస్తూ ఉండాలి.

3. లవంగాల సహాయం..

మీరు బియ్యం, పప్పులు వంటివి స్టోర్ చేసిన కంటైనర్ లో లవంగాలు చేర్చినా పురుగులను తరిమి కొట్టచ్చు. ప్రతి ఒక్క కంటైనర్లో నాలుగు నుంచి ఐదు లవంగాలను కలపండి. ఇవి తేమను తొలగిస్తాయి. లవంగాల్లో ఉండే ఘాటుకు పురుగులు పారిపోతాయి. కీటకాలు కూడా దరి చేరవు. ఎక్కువ కాలం పప్పులు నిల్వ ఉంటాయి.

4.రాక్ సాల్ట్..

మీరు బియ్యం,పప్పుల్లో ఉప్పు చేర్చినా కూడా బియ్యం, పప్పుల్లో పురుగులు పట్టకుండా ఉంటుంది. దాని కోసం మీరు డైరెక్ట్ గా ఉప్పు కలపకపోయినా ఏదైనా వస్త్రంలో ఉప్పు మూట కట్టి.. దానిని బియ్యం, పప్పులు ఉన్న డబ్బాలో ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల.. అది తేమను గ్రహిస్తుంది. ఎక్కువ రోజులు బియ్యం, పప్పులు తాజాగా ఉంటాయి.

సిలికా జెల్ ప్యాకెట్లను వాడండి

మీరు మార్కెట్లో సిలికా జెల్ ప్యాకెట్లను సులభంగా కనుగొనవచ్చు. ఇది తేమను ఆరబెట్టడానికి పనిచేస్తుంది. మీరు పప్పుధాన్యాలను నిల్వ చేసే కంటైనర్‌లో చిన్న సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచండి. ఇది తేమను గ్రహిస్తుంది మరియు వర్షాకాలంలో అవి చెడిపోకుండా నిరోధిస్తుంది.

నల్ల మిరియాలు లేదా బిర్యానీ ఆకు జోడించండి

బియ్యం, పప్పులు నిల్వ చేసే డబ్బాలో మీరు నల్ల మిరియాలు లేదా బిర్యానీ ఆకులను ఉంచడం వల్ల అవి చెడిపోకుండా ఉంటాయి. ప్రతి కంటైనర్ లో 5 నుండి 6 నల్ల మిరియాలు , రెండు నుండి మూడు బిర్యానీ ఆకులను ఉంచడం ద్వారా మీరు దానిని నిల్వ చేయవచ్చు.

ఇంగువ వాడండి

పప్పులు నిల్వ చేసిన పాత్రలో చిన్న ఇంగువ ముక్కను ఉంచడం వల్ల కీటకాలను నివారిస్తుంది. తేమ నుండి కూడా రక్షిస్తుంది.

పరుగులు రావడం మొదలవ్వగానే...

పొరపాటున కీటకాలు పప్పుల డబ్బాలోకి ప్రవేశిస్తే లేదా అవి తడిగా మారితే, వెంటనే వాటిని ఎండలో ఆరబెట్టండి లేదా పాన్‌లో ఎండబెట్టి వేయించండి. తరువాత వాటిని జల్లెడ ద్వారా వడకట్టి వేప ఆకులు, లవంగాలు వేసి మళ్ళీ ప్యాక్ చేయండి.