మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ నీరు రోజూ ఒకసారి తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
మునగాకు నీటిలో విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
మునగాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మునగాకు నీటిని రోజూ తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను నివారించవచ్చు.
మునగాకు నీరు తాగడం వల్ల జీవక్రియ పెరిగి, ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ వంటి వివిధ జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి మునగాకు నీరు సహాయపడుతుంది.
మునగాకు నీటిలో ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.
మునగాకులో పాలీఫెనాల్స్, టానిన్లు, సపోనిన్లు ఉంటాయి. ఇందులో రక్తపోటును తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి.
బెండకాయ తింటే బరువు తగ్గుతారా?
రాత్రిపూట అన్నం బదులు 2 చపాతీలు తింటే ఏమవుతుందో తెలుసా?
పాల మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలి?
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఏమౌతుంది?