Telugu

New Year 2026: కొత్త సంవత్సరంలో ఈ ఐదు పనులు మాత్రం చేయకూడదు

Telugu

కొత్త ఏడాదిలో చేయకూడని పనులు..

2026 సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1న కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Image credits: Getty
Telugu

ఎవరినీ వట్టి చేతులతో పంపొద్దు

కొత్త సంవత్సరం మొదటి రోజు ఎవరైనా భిక్షగాడు డబ్బు లేదా భోజనం కోసం వస్తే, వాళ్లను వట్టి చేతులతో పంపొద్దు. మీ శక్తి కొలది ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వండి. దీనివల్ల అదృష్టం కలిసివస్తుంది.

Image credits: Getty
Telugu

ఎవరి దగ్గరా అప్పు చేయొద్దు

జనవరి 1న ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు, అప్పు చేసి ఏ వస్తువు కొనొద్దు. ఇలా చేస్తే ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి పనులకు దూరంగా ఉండండి.

Image credits: Getty
Telugu

ఎవరితోనూ గొడవ పడొద్దు

కొత్త ఏడాది రోజు ఎవరితోనూ గొడవ పడొద్దు. లేదంటే ఏడాది పొడవునా ఎవరో ఒకరితో గొడవలు జరుగుతూనే ఉంటాయి. జనవరి 1న ప్రశాంతమైన మనసుతో అందరితో మెలగండి.

Image credits: Getty
Telugu

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

జనవరి 1న ఆల్కహాల్ లాంటి ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకండి. కొత్త ఏడాదికి సాత్వికంగా స్వాగతం పలకండి. గుడికి వెళ్లి భజనలు, కీర్తనలు చేయండి. దీనివల్ల మేలు జరుగుతుంది.

Image credits: Getty
Telugu

ఎవరి మనసు నొప్పించొద్దు

కొత్త సంవత్సరం మొదటి రోజు పొరపాటున కూడా ఎవరి మనసు నొప్పించొద్దు. అంటే ఎవరినీ చెడుగా మాట్లాడొద్దు, అవమానించొద్దు. చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వొద్దు. ఈ విషయాలు గుర్తుంచుకోండి.

Image credits: Getty

టీచర్లకు అదిరిపోయే చెక్ డిజైన్ చీరలు

మెడ నిండుగా కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే

వెండి స్నేక్ పట్టీల్లో అదిరిపోయే డిజైన్లు

వంట గదిలో ఈ ఒక్క పదార్థం వాడినా జుట్టు వేగంగా పెరుగుతుంది