బిడ్డ పుట్టాక గ్యాప్ వచ్చిందా.. సమస్యకు పరిష్కారం ఇదే

తాజాగా నిర్వహించిన పరిశోధనలో తొలి బిడ్డ పుట్టాక దంపతుల దాంపత్య జీవితంలో చాలా గ్యాప్ వస్తుందని.. అదే రెండో బిడ్డ పుట్టినా తొలి నాలుగు నెలల్లో కష్టాలు తీరిపోతాయని.. పిల్లల పెంపకం అలవాటైపోతుందని.. తద్వారా మునుపటి దాంపత్య జీవితం సొంతమవుతుందని మిచిగాన్ పరిశోధకులు పేర్కొన్నారు.

Couples Therapy: How to Stay Close After Baby

పెళ్లైన కొత్తలో దంపతులు జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తారు. ఒక్కసారి మధ్యలోకి పిల్లలు వస్తే... సమయమంతా వారికి కేటాయించడంలోనే సరిపోతుంది. తమ కంటూ సమయం కేటాయించుకోవడం కష్టంగా ఉంటుంది. పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యే వరకు వారికి ఈ ఇబ్బంది తప్పదు.

అంతేకాకుండా తొలిసారి తల్లిదండ్రుల హోదా వస్తుండటంతో వారిని ఎలా ఆడించాలి.. ఎలా ఊరడించాలి..? ఎలాంటి ఆహారం పెట్టాలి అంతా కొత్తగా ఉంటుంది. కాబట్టి సమయమంతా వారి కోసమే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పుడుతుంది. ఈ క్రమంలో దంపతులకు కనీసం రోజులో గంట కూడా స్వేచ్ఛ దొరకదు అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. 

అయితే దీనిని పరిష్కారం వెంటనే మరో బిడ్డను కనేయడం అంటున్నారు నిపుణులు.  రెండో బిడ్డ పుట్టాక దంపతుల దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుందని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు.తాజాగా నిర్వహించిన పరిశోధనలో తొలి బిడ్డ పుట్టాక దంపతుల దాంపత్య జీవితంలో చాలా గ్యాప్ వస్తుందని.. అదే రెండో బిడ్డ పుట్టినా తొలి నాలుగు నెలల్లో కష్టాలు తీరిపోతాయని.. పిల్లల పెంపకం అలవాటైపోతుందని.. తద్వారా మునుపటి దాంపత్య జీవితం సొంతమవుతుందని మిచిగాన్ పరిశోధకులు పేర్కొన్నారు.

రెండు వందలకు పైగా జంటలపై నిర్వహించిన ఈ పరిశోధనలో రెండో పురుడు తర్వాత భార్యాభర్తలు ఒకరిపై ఒకరు రుసరుసలాడుకోవడం బాగా తగ్గించేస్తున్నారని.. ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడం.. భాగస్వామి పట్ల చాలా బాధ్యతతో వ్యవహరించడం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. సో.. రెండో బిడ్డ పుట్టాక.. దంపతుల మధ్య దాంపత్య జీవితం మళ్లీ చిగురిస్తుందన్నమాట.

తొలి బిడ్డ పుట్టిన తర్వాత ఇంకొందరికి మరో రకమైన సమస్యలు ఎదురౌతున్నాయి. కొందరికి ఆసక్తి తగ్గిపోవడం, పురుషులకేమో వెంటనే స్కలనం జరగడం లాంటివి జరుగుతున్నాయి. అయితే దీనికి కూడా పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.

టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుదల, ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను వైద్యులకు వివరిస్తే.. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సరైన చికిత్స తీసుకుంటే సమస్య నుంచి త్వరగా  బయటపడొచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios