న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప‌రిధిలోని మినీర‌త్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్‌)లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌ చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఈనెల 26లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 170 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. 

మొత్తం పోస్టులు: 170

 సివిల్ ఇంజినీర్‌- 50, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌-30, మెకానిక‌ల్ ఇంజినీర్‌-90 పోస్టుల చొప్పున ఉన్నాయి. 

also read రైట్స్‌లో ఇంజినీర్ పోస్టుల నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

అర్హ‌త‌: బీఈ / బీటెక్ లేదా బీఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్‌ ఇంజినీరింగ్, మెకానిక‌ల్ / ఇండ‌స్ట్రియ‌ల్ / ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. రెండేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష (60 శాతం), ఇంట‌ర్వ్యూ (35 శాతం), అనుభ‌వం (5 శాతం) ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.300

ద‌ర‌ఖాస్తు చివరి తేదీ: న‌వంబ‌ర్ 26

అధికారిక వెబ్‌సైట్‌: http://www.rites.com