భార‌త ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలీ. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారు. మొత్తం ఉన్న ఖాళీలు 100. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం...

ఇర్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ పోస్టుల వివ‌రాలు
 

also read TSPSC Jobs: టి‌ఎస్‌పి‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి 

విభాగాలవారీగా ఉన్న ఖాళీలు:

 వ‌ర్క్స్ ఇంజినీర్‌: 48

 జియోల‌జిస్ట్‌: 04

 సీనియ‌ర్ వ‌ర్క్స్ ఇంజినీర్‌(సివిల్): 19

 సైట్ సూప‌ర్‌వైజ‌ర్‌ (సివిల్): 21

 సీనియ‌ర్ వ‌ర్క్స్ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్): 01

 సైట్ సూప‌ర్‌వైజ‌ర్‌ (ఎలక్ట్రికల్): 02

 సీనియర్ సైట్ సూప‌ర్‌వైజ‌ర్‌ (ఎలక్ట్రికల్): 04


అర్హత‌: ఇంజినీరింగ్ స‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అనుభ‌వం కూడా తప్పనిసరి.

also read హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌(SPP)లో ఖాళీలు...అప్లై చేసుకోవటానికి క్లిక్ చేయండి.


వయోపరిమితి: ఉద్యోగాల వారీగా వయోపరిమితిని నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 35 సంవత్సరాల వయస్సు మించకూడదు.

ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసే విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 01.01.2020 చివ‌రితేది: 21.01.2020.

అప్లై చేసుకోవడానికి  https://www.ircon.org/index.php?lang=en   క్లిక్ చేయండి