APSSDC Job Mela: ఏపీలో 1000 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక..!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్‌మేళా ద్వారా Amara Raja Groupతో పాటు Bharat FIH, Green tech, Apollo Pharmacy, Digi Technology, Dixon technologies తదితర ప్రముఖ సంస్థల్లో దాదాపు 1000 ఖాళీలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఖాళీల వివరాలు:
Amara Raja Group: ఈ సంస్థలో 300 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ (పాస్/ఫెయిల్), ఐటీఐ (పాస్/ఫెయిల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500 వేతనం ఉంటుంది. ఎంపికైన వారు చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-29 ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
Green tech Industries: ఈ సంస్థలో 250 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది.
Apollo Pharmacy: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/బీఫార్మసీ/ఎంఫార్మసీ/డీఫార్మసీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.10,400 నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది.
Bharat FIH Limited: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. అసెంబ్లీ లైన్ హెల్పర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12,328 వేతనం ఉంటుంది. వయస్సు 19-29 ఏళ్లు ఉండాలి.
Digi Technology, Dixon: ఈ సంస్థల్లో 170 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశం: రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు Govt Degree College, Tirupati-Thiruthani Road, Near Mandapam, Nagari, Chittoor Dist- 517590 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.