Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ ఎన్‌ఎం‌డి‌సిలో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక.. వెంటనే అప్లయి చేసుకోండీ..

ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన వారి కోసం ఎన్‌ఎం‌డి‌సి  అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 59 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. 

nmdc recruitment 2021 for 59 graduate apprentice technician apprentice posts check more details at nmdc co in
Author
Hyderabad, First Published May 15, 2021, 8:59 PM IST

నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 59 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ లేదా ఈ-మెయిల్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి  ఆఖరు తేది జూన్‌ 15. ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్  రూపొందిస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు పూర్తి వివరాల కోసం  https://www.nmdc.co.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 59

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 16

టెక్నీషియన్ అప్రెంటిస్- 13

ప్రోగ్రామింగ్ అండ్ సిస్టెమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 30

also read తెలంగాణ టీఎస్‌పీఎస్‌సి 2021 ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లయి చేసుకోవడానికి క్లిక్ చేయండి.. ...


విద్యార్హతలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (బీటెక్‌/బీఈ) చేసిన వారు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు.  వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల వేతనం చెల్లించనున్నారు.

టెక్నీషియన్ అప్రెంటిస్‌: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్‌ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కోర్సుల్లో మూడేళ్ల డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల వేతనం చెల్లించనున్నారు.

అంతేకాకుండా పి‌ఏ‌ఎస్‌ఏ‌ఏ పోస్టులకు కంప్యూటర్ ఆపరేటర్ ఇంకా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సి‌ఓ‌పి‌ఏ ) నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వరకు చెల్లించనున్నారు.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 15 జూన్‌  2021

ఈ- మెయిల్: bld5hrd@nmdc.co.in

అధికారిక  వెబ్‌సైట్‌:https://www.nmdc.co.in/

Follow Us:
Download App:
  • android
  • ios