ట్రంప్ భారత పర్యటన ఇప్పుడు యావత్ భారత దేశాన్ని ఊపేస్తున్న ఒక అంశం. ట్రంప్ రెండు రోజుల పర్యటనలో నమస్తే ట్రంప్ అనే ఈవెంట్ లో అహ్మదాబాద్ లో మోడీ తో కలిసి ఉపన్యసించిన తరువాత అక్కడి నుండి ఆగ్రా కి వెళ్తారు.

అక్కడ ఆగ్రాను దర్శించి ఢిల్లీ కి వస్తారు. తరువాతి రోజు ఢిల్లీ లో మధ్యాహ్నం మోడీ ఇచ్చే విందుకు హాజరవుతారు. రాత్రి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే అధికారిక రాష్ట్ర విందుకు హాజరవుతారు. 

గతంలో బుష్ భారత పర్యటనకు వచ్చినప్పుడు బిర్యానీని రుచి చూసాడు. తరువాత ఒబామా వచ్చినప్పుడు కబాబ్ లను రుచి చూసారు. ఇప్పుడు ట్రంప్ వస్తున్న సందర్భంగా మెనూ ఎం ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ కి ఇష్టమైన వంటకాలేంటో ఒకసారి చూద్దాం. 

Also read; ట్రంప్ భారత పర్యటన: కథ మొత్తం చికెన్ లెగ్ పీసుల చుట్టూనే..!!

ట్రంప్ సహజంగా నే ఫాస్ట్ ఫుడ్ అభిమాని. ఆయన డైట్ కోక్, మాక్ డొనాల్డ్స్ ఫుడ్ ని అమితంగా ఇష్టపడతాడు. వాటిని ఎల్లప్పుడూ తినడానికి ట్రంప్ ఆసక్తిని చూపెడుతుంటాడు. ట్రంప్ కి వీటితోపాటు ఏయే ఫుడ్ అంటే ఇష్టమో తెలుసుకుందాం. 

సాధారణంగా ట్రంప్ అల్పాహారాన్ని సేవించాడు. ఒకవేళ మంచిగా తినాలనుకుంటే మాత్రం పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. ఒకవేళ తొందర్లో ఉంటె మాత్రం పాలతోపాటు కలిపిన తృణధాన్యాలయినా ఓకే!

ట్రంప్ కి మాక్ డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఆహారమంటే బోలెడంత ఇష్టం. 2016 ఎన్నికల ప్రచారంలో ఆయన దాదాపుగా ఆ ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఆహరం మీదనే గడిపాడు. అక్కడి ఎగ్ మెఫిన్స్ అంటే ట్రంప్ కి అత్యంత ఇష్టం. వాటిని ఉదయాన్నే తిని తన ఎన్నికల ప్రచారానికి బయలుదేరేవాడు. ఆ జాయింట్ నుంచి ట్రంప్ కి ఫిష్ శాండ్విచ్ అన్నా, చాక్లెట్ షాక్ అన్న అమితమైన ఇష్టం. 

ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. ఆయనకు టీ, కాఫీ,మందు అలవాట్లు లేవని చెప్పుకునే ట్రంప్ డైట్ కోక్ ని మాత్రం లీటర్ల కొద్దీ తాగుతాడు. ఆయనఅప్పుడప్పుడు రోజుకు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

Also read; ట్రంప్ తో విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్: ఏపీ సీఎం వైఎస్ జగన్ డౌట్

ట్రంప్ కి ఎప్పుడు నోరు కారకరలాడుతూనే ఉండాలంట. అందుకే ఆయన ఎక్కువగా ఆలుగడ్డ చిప్స్ ని తింటుంటాడు. లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటుంటాడు. ఆయన కిచెన్ లో గాని, ఫ్లైట్ లో గాని, కార్ లో గాని లేస్ చిప్స్ ఖచ్చితంగా ఉంటాయట. 

ట్రంప్ కి ఇష్టమైన మరో ఫాస్ట్ ఫుడ్ జాయింట్ కేఎఫ్ సి, అక్కడి చికెన్ బకెట్ అంటే అమితమైన ఇష్టమట. ఆ బకెట్ తోనే చాలాసార్లు తన లంచ్ లను కానిచ్చేస్తుంటాడు ట్రంప్.  ఆ చికెన్ బకెట్ తో పాటుగా డైట్ కోక్ ని కలిపి తాగుతూ తెగ ఆస్వాదిస్తుంటాడు ట్రంప్. 

ఎక్కువగా మాంసాన్ని ఇష్టపడే ట్రంప్ అప్పుడప్పుడు రొయ్యలు, చేపలపైనా కూడా మనసుపారేసుకుంటాడట. కానీ అమావాస్యకో పున్నానికో ఒక్కసారి మాత్రమేనట. ఇక పిజ్జా విషయానికి వస్తే పైనున్నవాణ్ణి ఏరుకొని తినేసి చిన్నపిల్లాడిలా కిందవి వదిలేస్తుంటాడట ట్రంప్. 

ఇక ఆహరం తిన్నాక ఎవరికైనా స్వీట్ తినాలని అనిపించడం సహజం. అలానే ట్రంప్ కి కూడా చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం తినడమంటే మహా సరదా అట. దానితోపాటుగా డిజర్ట్ గా ఆయనకు మరో ఇష్టమైన ఐటెం చాక్లెట్ కేక్.

ఇవి ట్రంప్ అత్యంత ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్స్. చూడాలి వీటిలో ఎన్నింటిని మోడీ అందిస్తారో... లేదా భారతీయ ఫుడ్ మోజులో పడి వాటిని మరిచి ఇక్కడి ఆహారాన్ని ఎంజాయ్ చేస్తాడో!