బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి శ్రీలంక పోలీసులు పురోగతి సాధించారు. కొలంబోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఆరుగురు అనుమానితుల ఫోటోలను అధికారులు విడుదల చేశారు.

వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నేషనల్ తౌహిత్ జమాత్ సంస్థకు చెందిన 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులు వరుస పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుళ్ల తర్వాత నుంచి దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు 76 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆరుగురి పోస్టర్లను దేశవ్యాప్తంగా ప్రధా కూడళ్లలో అంటించారు. వీరి ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం దేశ వ్యాప్తంగా గాలింపులు జరుపుతున్నట్లు శ్రీలంక భద్రతా విభాగం వెల్లడించింది.

కాగా, పేలుళ్లలో మరణించిన వారి సంఖ్యను అధికారులు తగ్గించారు. మొదట ప్రకటించినట్లుగా 359 మంది మరణించలేదని ... బాధితులను రెండు సార్లు లెక్కించడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని, పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య 253 మంది మాత్రమేనని తేల్చారు. 

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు